Skip to main content

స్పెల్లింగ్ బీ పోటీల్లో తొలిస్థానం దక్కించుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్?

అమెరికాలో ప్రతిష్టాత్మక స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో 2021 సంవత్సరానికి గాను ఆఫ్రికన్ అమెరికన్ జైలా అవంత్–గార్డే(14) విజేతగా నిలిచింది.

ఇప్పటిదాకా 93 సార్లు ఈ పోటీలు జరగ్గా, తొలిస్థానం దక్కించుకున్న మొదటి ఆఫ్రికన్ అమెరికన్గా రికార్డు సృష్టించింది. ఈ పోటీల్లో భారతీయ అమెరికన్లు రెండు, మూడు స్థానాలను దక్కించుకున్నారు. రెండో స్థానంలో శాన్ఫ్రాన్సిస్కోకు చెందిన చైత్రా తుమ్మల(12), మూడో స్థానంలో న్యూయార్క్కు చెందిన భావన మాదిని(13) నిలిచారు. ఫ్లోరిడాలోని ఒర్లాండోలో జూలై 8న జరిగిన స్పెల్లింగ్ బీ ఆఖరి దశ పోటీలో 11 మంది పాల్గొన్నారు.

మెడికేర్ డైరెక్ట‌ర్‌గా డాక్టర్ మీనా...
భారతీయ అమెరికన్, ఆరోగ్య విధాన నిపుణురాలు డాక్టర్ మీనా శేషమణికి(43) అమెరికాలో కీలక పదవి లభించింది. జో బైడెన్ ప్రభుత్వం ఆమెను యూఎస్ సెంటర్ ఫర్ మెడికేర్ డైరెక్టర్‌గా నియమించింది. ఈ విభాగం డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్, డైరెక్టర్‌గా మీనా వ్యవహరిస్తారు. ఆమె నియామకం జూలై 6 నుంచి అమల్లోకి వచ్చింది. 65 ఏళ్లు పైబడిన వారికి, వైకల్యంతో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి వైద్య సేవలందించడంలో సెంటర్ ఫర్ మెడికేర్దే కీలకపాత్ర.

క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021–స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీలో విజేతగా నిలిచిన ఆఫ్రికన్ అమెరికన్?
ఎప్పుడు : జూలై 9
ఎవరు : జెలా అవంత్–గార్డే(14)
ఎక్కడ : ఒర్లాండో, ఫ్లోరిడా, అమెరికా

Published date : 10 Jul 2021 07:27PM

Photo Stories