Skip to main content

Tenth Class: పబ్లిక్‌ పరీక్షలపై బ్లూప్రింట్‌ విడుదల

రాష్ట్రంలో 10th Class Public Examinations విధానంలో ప్రభుత్వం మార్పులు చేసిన నేపథ్యంలో అందుకనుగుణంగా Blue Printsను విడుదల చేసినట్లు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ దేవానందరెడ్డి సెప్టెంబర్‌ 8న ఒక ప్రకటనలో తెలిపారు.
Tenth Class
పబ్లిక్‌ పరీక్షలపై బ్లూప్రింట్‌ విడుదల

2022లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 11 పేపర్లకు బదులు 6 పేపర్లలోనే పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. 2022–23 విద్యా సంవత్సరం నుంచి కూడా ఇదే విధానాన్ని అమలు చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆగస్టు 22న ప్రభుత్వం జీవో 136ను విడుదల చేసింది. ఆరు పేపర్ల విధానానికి అనుగుణంగా మోడల్‌ పేపర్లు, బ్లూప్రింట్, క్వశ్చన్‌ పేపర్లవారీగా వెయిటేజీలను https://www.bse.ap.gov.in లో ఉంచినట్లు దేవానందరెడ్డి వెల్లడించారు. 

Published date : 09 Sep 2022 05:44PM

Photo Stories