Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 21న నగరంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మునిసిపల్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు బైజూస్ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా మాట్లాడుతూ.. మంచి విద్య మెరుగైన భవిష్యత్తుకు పునాది వంటిదన్నారు. విద్యార్థులు హుషారుగా పాఠశాలకు వచ్చేలా 1వ తరగతి నుంచి స్మార్ట్ టీవీ ద్వారా డిజిటల్ క్లాస్‌రూమ్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
చదవండి: Education: చదువే ఆయుధం.. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వమూ చెయని విప్లవాత్మక సంస్కరణలు
6 నుంచి 10వ తరగతి వరకు ప్రతి తరగతి గదిలోను ఇంట్రాక్టివ్ ప్లాట్ ప్యానల్స్(ఐఎఫ్‌పీ) ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు డిజిటల్ విద్య అందుతుంటే.. పచ్చ మీడియా ట్యాబ్‌లపై తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.
డీఈఓ డాక్టర్ వి రంగారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు 32,782 మంది ఉన్నారని, ఇందులో మొదటి విడతగా 25 మండలాల్లో 5,161 మందికి మొదటి రోజు ట్యాబ్‌లు పంపిణీ చేశామన్నారు. ఒక్కో ట్యాబ్ ధర రూ.33 వేలు ఉంటుందన్నారు. కార్యక్రమంలో స్కూల్ హెచ్‌ఎం విజయలక్ష్మీ, జిల్లా నోడల్ అధికారి వై.ధనరాజ్ తదితరులు పాల్గొన్నారు.