School Text Books: 4.42 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభం.. ఈ కాపీలు వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఏపీలో వచ్చే విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల ముద్రణ ప్రారంభమైంది. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజే (జూన్ 12) వీటిని విద్యార్థులకు పంపిణీ చేసే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ 4.42 కోట్ల పాఠ్యపుస్తకాల ముద్రణకు శ్రీకారం చుట్టింది.
దేశంలోనే ఒకటి నుంచి పదో తరగతి వరకు ద్విభాషా (బైలింగ్యువల్) విధానంలో పాఠ్యపుస్తకాలను అందిస్తున్న బోర్డుగా ఏపీ పాఠశాల విద్యా శాఖ నిలుస్తోంది. 10వ తరగతి ఫిజికల్ సైన్స్ పుస్తకం భవిష్యత్తులోనూ రిఫరెన్స్ బుక్‌గా ఉండేలా తీర్చిదిద్దుతోంది.
చదవండి: ఏపీ టెన్త్ క్లాస్ - స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ 2024 | టైం టేబుల్ 2024 | ముఖ్యమైన ప్రశ్నలు | గైడెన్స్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్ | టిఎస్ టెన్త్ క్లాస్
2024–2025 విద్యా సంవత్సరంలో తొలిసారిగా ఫ్యూచర్ స్కిల్ సబ్జెక్ట్‌ను పరిచయం చేస్తూ 8వ తరగతి విద్యార్థులకు బోధించనుంది. 3–9 తరగతులకు టోఫెల్ కోసం వర్క్‌బుక్‌లను సిద్ధం చేస్తోంది. ఈ పాఠ్యపుస్తకాల పీడీఎఫ్ కాపీలను వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉంచనుంది.
Published date : 30 Mar 2024 02:50PM