10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు
Sakshi Education
10th Class Supplementary Exams2024 :పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు సన్నాహాలు
శ్రీకాకుళం : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖాధికారులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ నెల 24 నుంచి జరగనున్న పరీక్షలకు జిల్లా విద్యాశాఖ అధికారి కె.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అసిస్టెంట్ కమిషనర్ లియాఖత్ ఆలీఖాన్, ఇతర అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 28745 మంది పది పరీక్షలకు హాజరుకాగా 93.36 శాతం ఉత్తీర్ణతతో 26836 మంది ఉత్తీర్ణులయ్యారు.
Also Read: AP Tenth Class Model Papers 2024
1909 మంది ఫెయిలయ్యారు. పరీక్ష ఫీజు చెల్లించేందుకు పరీక్ష ముందు రోజు వరకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఫీజులు చెల్లించే విద్యార్థులకు జిల్లా వ్యాప్తంగా 8 కేంద్రాల్లో పరీక్షలు రాసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్‌లు, డీవోలు, కస్టోడియన్లు, తనిఖీ బృంధాల నియామకంలో అధికారులు నిమగ్నమయ్యారు.
Published date : 17 May 2024 02:00PM