Skip to main content

AP Tenth Class Supplementary Exam 2024: పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి .....

AP Tenth Class Supplementary Exam 2024: పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి .....
Tenth class advanced supplementary examination schedule   Commissioner S. Suresh Kumar speaking during the virtual meeting
AP Tenth Class Supplementary Exam 2024: పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి .....

పదవ తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి జూన్‌ 6వ తేదీ వరకు నిర్వహించబోతున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ వెల్లడించారు. ఈ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి­చేసుకోవాలని సోమవారం వర్చువల్‌ మీటింగ్‌లో జిల్లా విద్యాశాఖాధికారులను ఆయన ఆదేశించారు. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వారి­లో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు­న్నా­రు. రాష్ట్రవ్యాప్తంగా 685 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసా­మన్నారు.

Also Read :  AP 10th Class Model Papers

పరీక్షల నిర్వహణ కోసం 685 మంది  చీఫ్‌ సూపరింటెండెంట్స్, 685 మంది డిపార్టుమెంటల్‌ ఆఫీ­సర్లు, 6,900 మంది ఇన్విజిలేటర్లతో పాటు 86 ఫ్లైయింగ్‌  స్క్వాడ్స్‌ ఏర్పాటు చేశామన్నారు. మొబైల్‌ పోలీస్‌ స్క్వాడ్స్‌ కూడా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.  ఆర్టీసీ డిపో మేనేజర్లతో చర్చిం­చి పరీక్షా కేంద్రాలకు తగినన్ని బస్సు సర్వీసులు నడిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతీ కేంద్రంలో ఏఎన్‌ఎంతో పాటు ఫస్ట్‌ ఎయిడ్‌ కిట్స్‌ ఉండేలా చూడాలని సూచించారు.

ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరిగే ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 8.45 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుందన్నారు.  ఈ నెల 15వ తేదీ నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్స్‌ జారీ చేస్తామని చెప్పారు. మాల్‌ ప్రాక్టీసెస్‌కు పాల్పడితే ఏపీ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ యాక్టు 1997 కింద చర్యలు తీసుకుంటామని తెలిపారు. 0866–2974540 లేదా, dir-gove­xmas­@yahoo.com లో సంప్రదించాలన్నారు.

పరీక్షల నిర్వహణ తేదీలిలా..
ఫస్ట్‌ లాంగ్వేజ్‌               24–05–24
సెకండ్‌ లాంగ్వేజ్‌         25–05–24
థర్డ్‌ లాంగ్వేజ్‌               27–05–24
మాథమెటిక్స్‌                28–05–24
ఫిజికల్‌ సైన్స్‌               29–05–24
బయోలాజికల్‌ సైన్స్‌    30–05–24
సోషల్‌ స్టడీస్‌                31–05–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌–1    01–06–24
ఓఎస్‌ఎస్‌సీ పేపర్‌–2    03–06–24 

Published date : 21 May 2024 10:35AM

Photo Stories