Skip to main content

పదో తరగతి ఫలితాల్లో 10/10 యావరేజ్‌ జీపీఏ సాధించిన విద్యార్ధుల్లో బాలికలే టాప్‌

సాక్షి, హైదరాబాద్‌: పదో తరగతిలో 10/10 గ్రేడ్‌ పాయింట్‌ యావరేజ్‌ (జీపీఏ) సాధించిన విద్యార్థు«ల్లో బాలికలే అత్యధికంగా ఉన్నారు.
శుక్రవారం ప్రకటించిన పదో తరగతి ఫలితాల్లో 2,10,647 మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించగా, అందులో బాలికలే ముందంజలో ఉన్నారు. మొత్తం 10/10 జీపీఏ సాధించిన వారిలో బాలురు 90,793 మంది ఉండగా, బాలికలు 1,19,854 మంది ఉండటం విశేషం. మరోవైపు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులే అత్యధికంగా 10/10 జీపీఏ సాధించారు. ప్రభుత్వంలోని అన్ని యాజమాన్యాల పాఠశాలల తో పోల్చితే ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఎక్కువ మంది ఉన్నారు. మొత్తంగా 11,445 పాఠశాలల నుంచి పదో తరగతి విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, అందులో 10/10 జీపీఏ సాధించిన (పాఠశాలలోని మొత్తం పదో తరగతి విద్యార్థులు 10/10 సాధించినవి) పాఠశాలలు కూడా ప్రైవేటులోనే ఎక్కువగా ఉన్నాయి. వంద శాతం (పదికి పది) జీపీఏ సాధించిన పాఠశాలలు మొత్తం 535 ఉంటే అందులో ప్రైవేటు బడులే 421 ఉన్నాయి. రాష్ట్రంలో 185 ఎయిడెడ్‌ స్కూళ్లు ఉంటే ఒక్క బడిలోనే మొత్తం విద్యార్థులకు 10/10 జీపీఏ లభించింది. ఆశ్రమ పాఠశాలలు, మోడల్‌ స్కూళ్లలో ఒక్క దాంట్లోనూ విద్యార్థులందరికీ 10/10 జీపీఏ రాలేదు. మొత్తంగా 10/10 సాధించిన వారిలో ప్రైవేటు విద్యార్థులే 1,21,809 మంది (57.82 శాతం) ఉన్నారు.

పదో తరగతి తర్వాత ఎంపిక చేసుకోవల్సిన కోర్సులు, ఉద్యోగావకాశాలు, ఎక్స్‌పర్ట్స్‌ కెరీర్‌ గైడెన్స్‌... ఇతర సమాచారం కోసం క్లిక్‌ చేయండి. 

అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలోనే..
రాష్ట్రంలోని 8 జిల్లాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ మంది 10/10 జీపీఏ సాధించారు. వాటిల్లోనే లక్ష మందికిపైగా ఆ జీపీఏను సాధించారు. అత్యధికంగా హైదరాబాద్‌ జిల్లాలో 22,035 మంది 10/10 సాధించారు. ఆ తరువాత మేడ్చల్‌ జిల్లాలో 20,556 మంది, రంగారెడ్డి జిల్లాలో 20,119 మంది, నిజామాబాద్‌ జిల్లాలో 10,056 మంది, వరంగల్‌ అర్బన్‌లో 9,153 మంది, సంగారెడ్డిలో 9,857 మంది, నల్లగొండలో 9,807 మంది, ఖమ్మంలో 9,739 మంది విద్యార్థులు 10/10 జీపీఏను సాధించారు.
Published date : 22 May 2021 02:14PM

Photo Stories