10th Class Exams: వెనుకబడిన విద్యార్థులకు మరింతగా అర్థమయ్యేలా... ప్రోత్సాహక బహుమతులు
కె.కోటపాడు: టెన్త్ ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు కృషిచేయాలని, అందుకు అనుగుణంగా బోధన చేయాలని విద్యాశాఖ ఆర్‌జేడీ ఎం.జ్యోతికుమారి అన్నారు. స్థానిక హైస్కూల్‌ను శుక్రవారం ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సబ్జెక్ట్‌లలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి మరింతగా అర్థమయ్యేలా బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు.
Also Read : Success Story : టెన్త్.. ఇంటర్.. రెండుసార్లు ఫెయిల్.. కానీ రూ.2463 కోట్ల సంపాదించానిలా.. ఎలా అంటే..?
ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న పరీక్షల్లో మంచి మార్కులను సాధించిన టెన్త్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులను అందించాలన్నారు. జనవరి చివరి నాటి టెన్త్ సిలబస్‌ను పూర్తి చేయాలని తెలిపారు. రక్తహీనత సమస్య గల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం తరువాత ఐరన్ మాత్రలను తప్పనిసరిగా అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎంఈవోలు సత్యనారాయణ, డి.వి.డి. ప్రసాద్, ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి పాల్గొన్నారు.