Skip to main content

Madhuri: ‘జెండాను తాకగానే దేశభక్తిని అనుభూతి చెందుతున్నా’

Azadi Ka Amrit Mahotsav సందర్భంగా ఇండియన్‌ పోస్టాఫీస్‌ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖ జిల్లా ఎండాడలోని ప్ర­భుత్వ అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో Har Ghar Tiranga కార్యక్రమాన్ని ఆగస్టు 12న నిర్వహించారు.
Madhuri
మాధురి

ఈ సందర్భంగా పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జాతీయ జెండా చేత పట్టుకుని పరవశించిపోయింది. మాధురి మాట్లాడుతూ ‘ఇంతకు ముందు ఆగస్టు 15న స్కూల్‌లో జెండా ఎగురవేసేవారు. కానీ.. ఇప్పటివరకు నేను జాతీయ జెండాను చూడలేదు. హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా మన జెండాను తాకడం ద్వారా దేశభక్తిని అనుభూతి చెందుతున్నాను’ అని తెలిపింది. ఆమె భావాలను భారత తపాలా శాఖ సామాజిక మాధ్యమాలలో పోస్ట్‌ చేసింది. దీనిని చూసిన కేంద్ర కమ్యూనికేషన్స్‌ శాఖ మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిని చూసిన ప్రధాని నరేంద్ర మోదీ రీట్వీట్‌ చేస్తూ ‘ఈ వీడియో ద్వారా ప్రతి భారతీయుడు మూడు రంగుల జెండాతో సుదీర్ఘమైన అనుబంధం కలిగి చేరువ అయినట్టు అర్థమవుతోంది’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని మాధురిని ప్రిన్సిపాల్‌ ఎం.మహేశ్వరరెడ్డి, పాఠశాల సిబ్బంది ఆగస్టు 15న అభినందించారు.

చదవండి:

Published date : 16 Aug 2022 03:25PM

Photo Stories