Skip to main content

Sankalp Seva Samiti: మెరిట్‌ విద్యార్థులకు ‘కలామ్‌’ అవార్డులు

తిరుపతి రూరల్‌ : మండలంలోని చిరుగువాడలో ఉన్న ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో న‌వంబ‌ర్‌ 19న‌ అబ్దుల్‌ కలామ్‌ జయంతిని పురస్కరించుకుని మెరిట్‌ విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు.
Recognition for Academic Excellence on Kalam's Birthday, November 19 Awards Ceremony at DPS Tirupati Rural, Delhi Public School Celebrates Kalam's Birth Anniversary, Meritorious Students Honored at Chirugowada Mandal. Kalam awards for meritorious students, Abdul Kalam Birth Anniversary Awards at Tirupati Rural,

సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజారెడ్డి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీ గురుమూర్తి పాల్గొని 205 మంది విద్యార్థులకు అవార్డులు అందజేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సేగు రెడ్డెప్ప రెడ్డికు సేవారంగంలో సేవలకు, శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీనియర్‌ జర్నలిస్ట్‌ డాక్టర్‌ గుంట లీలా ప్రసాద్‌రావుకు డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ మెమోరియల్‌ అవార్డు ప్రదానం చేసారు.

ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ అబ్దుల్‌ కలామ్‌ పేరిట విద్యార్థులకు బాలశౌర్య, బాలశ్రీ, బాలరత్న అవా ర్డులు ఇవ్వాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విన్నవించనున్నట్లు వెల్లడించారు. అబ్దుల్‌ కలామ్‌ జీవితం మనకు అందరికీ ఆదర్శనీయమన్నారు. నిరుపేద కుటుంబంలో జన్మించిన కలామ్‌ భారతజాతి గర్వించదగ్గ స్థాయికి ఎదిగారని కొనియాడారు. కలలు కనండి.. వాటి సాకారానికి కృషి చేయండి...అనే నినాదంతో ఎందరో విద్యార్థుల్లో స్ఫూర్తి నింపిన మార్గదర్శకులని వివరించారు.

చదవండి: 10th Class Exam: టెన్త్‌లో నూరుశాతం మార్కులసాధనే లక్ష్యం

ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం మాట్లాడుతూ సంకల్ప సేవా సమితి ఆధ్వర్యంలో గత ఏడేళ్లగా ఉత్తమ విద్యార్థులను అభినందనందిస్తూ సభలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. టీటీడీ డీఈఓ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ కఠోర దీక్షతో అబ్దుల్‌ కలామ్‌ తాను నిర్దేశించుకున్న గమ్యానికి చేరుకున్నారని తెలిపారు. నేటి యువతకు ఆయన గొప్ప రోల్‌మోడల్‌ అని వెల్లడించారు. డాలర్స్‌ గ్రూప్‌ అధినేత దివాకర్‌రెడ్డి మాట్లాడతుఊ విద్యార్థులు వ్యసనాలకు బానిసలు కాకుండా మంచి అలవాట్లు నేర్చుకోవాలని సూచించారు.

సంకల్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.రాజా రెడ్డి మాట్లాడుతూ అబ్దుల్‌ కలమ్‌ నిస్వార్థంగా సేవా నిరతితో జీవనం సాగించిన దార్శనికుడని కొనియాడారు. కార్యక్రమంలో మహమ్మద్‌రఫీ, విశ్వనాథరెడ్డి, డాక్టర్‌ వెంకటేశ్వర్లు, వెంకటరమణ రెడ్డి, రవీంద్రనాథ్‌ రెడ్డి, శ్రీధర్‌ రెడ్డి, ఓం ప్రకాష్‌ రెడ్డి, బాల సుబ్రమణ్యం, నగేష్‌, రాజేష్‌, బాలాజీ, అరుణకుమారి పాల్గొన్నారు.

Published date : 21 Nov 2023 01:30PM

Photo Stories