10th Class Exam: టెన్త్‌లో నూరుశాతం మార్కులసాధనే లక్ష్యం
పాడేరు రూరల్ : టెన్త్‌లో నూరుశాతం మార్కులు సాధన లక్ష్యంగా ప్రణాళికాపరంగా చర్యలు తీసుకుంటున్నామని పాడేరు ఐటీడీఏ పీవో అభిషేక్ తెలిపారు. దీనిలో భాగంగానే ఏజెన్సీ పరిధిలోని 122 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో టెన్త్ చదువుతున్న 320 మంది విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. వీరిలో 50 మందిని రాత పరీక్ష ద్వారా ఎంపిక చేసి టెన్త్ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
చదవండి: Selfie with Toppers: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో 'సెల్ఫీ విత్ టాపర్స్'
నేడు రాత పరీక్ష
పాడేరు ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలకు చెందిన టెన్త్ విద్యార్థులకు ఈనెల 6న పాడేరులో రాత పరీక్ష నిర్వహిస్తున్నట్టు పీవో అభిషేక్ తెలిపారు. పాడేరు పట్టణంలోని లోచలిపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 180 మంది బాలురకు, శ్రీకృష్ణాపురం గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో 140 మంది బాలికలకు రాత పరీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. వీరిలో ప్రతిభ ఆధారంగా 50 మందిని ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తామని పీవో పేర్కొన్నారు.