Skip to main content

Sainik School: సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కలికిరి సైనిక పాఠశాలలో 2022–23 విద్యా సంవత్సరానికి గాను 6, 9 తరగతులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Sainik School
సైనిక్‌ స్కూల్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

కలికిరి సైనిక పాఠశాలలో 6వ తరగతిలో 105 సీట్లుండగా ఇందులో 10 సీట్లు బాలికలకు కేటాయించారు. దరఖాస్తులు పూర్తిగా ఆన్ లైన్ లో ఎన్ టీఏ వెబ్‌సైట్‌ (httpr://airrec.nta.nic.in)లో మాత్రమే పూరించాల్సి ఉంటుందని తెలిపారు. అక్టోబర్‌ 26తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగుస్తుంది. 2022 ఏడాది జనవరి 9వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ర్టం లోని కలికిరి, తిరుపతి, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ఒంగోలు పట్టణాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

Published date : 29 Sep 2021 12:52PM

Photo Stories