Department Of Science & Technology: ఇన్‌స్పైర్ మనక్, ఇన్నోవేషన్.. ఎంపికై తే విద్యార్థి అకౌంట్‌లో రూ.10వేలు జమ
విద్యార్థి దశ నుంచే భావి శాస్త్రవేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తోంది. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో చదువుతున్న 6 నుంచి 10 తరగతుల విద్యార్థులతో ఏటా ఇన్‌స్పైర్ మనక్, ఇన్నోవేషన్ కార్యక్రమాల పేరిట ఆవిష్కరణలు తయారు చేయిస్తోంది. ఇందుకు అయ్యే ఖర్చు ను ప్రభుత్వమే భరిస్తోంది.
చదవండి: IITH: ఐఐటీహెచ్‌లో నేవీ ఇన్నోవేషన్ సెంటర్
వారి బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేసి కొత్త ఆవిష్కరణలు తయారు చేసే విధంగా ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఇన్‌స్పైర్ మానక్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మే నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ జిల్లాలో నత్తనడకగా సాగుతోంది. ఆగస్టు 31వరకు గడువు ఉంది. సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహిస్తే వారు భావి తర శాస్త్రవేత్తలుగా ఎదిగే అవకాశం ఉంటుంది.
చదవండి: ITU Area Office: ఐటీయూ ప్రాంతీయ కార్యాలయం, ఇన్నోవేషన్ సెంటర్ ప్రారంభం
జిల్లాలో..
ఇన్‌స్పైర్–మనక్ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్ర భుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలల వి ద్యార్థులు ఆవిష్కరణలు తయారు చేయవచ్చు. జి ల్లాలో 202 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు, 130 ప్రభుత్వ యూపీఎస్‌లు ఉన్నాయి. అలాగే 120 యూపీఎస్ ప్రైవేట్ పాఠశాలలు, 55 ప్రైవేట్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురు విద్యార్థుల చొప్పున దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం దరఖాస్తు చేసుకున్న పాఠశాలల్లో ప్రభుత్వం 10 శాతం పాఠశాలలను ఎంపిక చేస్తుంది. ఎంపికై న విద్యార్థి ఖాతాలో రూ.10వేల చొప్పున జమ చేస్తుంది. వీటిలో రూ.5వేలు విద్యార్థుల రవాణ చార్జీల కోసం, మరో రూ.5వేలు విద్యార్థి తయారు చేసే ప్రాజెక్ట్‌కు వెచ్చించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో ఎంపికై న వారిని రాష్ట్రస్థాయికి, అక్కడి నుంచి జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు.
ఉపాధ్యాయుల ప్రోత్సాహమేదీ..!
ఇన్‌స్పైర్ మనక్ అవార్డుల కోసం విద్యార్థులను ప్రో త్సహించి వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలి. అయితే ఆ దిశగా సర్కారు పాఠశాలల ఉపాధ్యాయులు ముందుకు సాగడం లేదని తెలుస్తోంది. మే నెలలో ఇన్‌స్పైర్ అ వార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా ఇప్పటివరకు కేవలం 35 దరఖాస్తులు మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదయ్యాయి. అయితే ఇందులో ఒక్కటి కూడా ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు లేవు. అ న్ని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలలకు సంబంధించినవి ఉండటం గమనార్హం. విద్యాశాఖ అధికారులు ఒత్తిడి తెస్తే చివరలో ఆదరాబాదరగా దరఖాస్తులు చేయడం పరిపాటిగా మారింది. ఇన్‌స్పైర్‌కు ఎంపికై న విద్యార్థుల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన త ర్వాత రెడీమేడ్ ప్రాజెక్టులను కొనుగోలు చేసి మే ళాలో ప్రదర్శించడం జిల్లాలో ఆనవాయితీగా వస్తోంది. కొంతమంది విద్యార్థులు మాత్రమే సొంతంగా ప్రాజెక్టులను తయారు చేసి ప్రతిభ చాటుతున్నారు. ఈవిషయంఉన్నతాధికారులకుతెలిసినప్పటికీ పట్టించుకోకపోవడంతో షరా మామూలుగా మారింది.
దరఖాస్తు ఇలా..
ఇన్‌స్పైర్ మేళాకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు www. inspireawards.gov.in వెబ్‌సైట్‌లో పేరు, తరగతి, పాఠశాల యూడైస్, ఆధార్, బ్యాంక్ ఖాతా ఇతర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాల నుంచి ఐదుగురికి అవకాశం ఉంది.