Skip to main content

10th Class Exams: టెన్త్‌ పరీక్షల సిబ్బందికి రెమ్యునరేషన్ భారీగా పెంచిన ఏపీ ప్ర‌భుత్వం

సాక్షి, ఎడ్యుకేష‌న్‌: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 26 కేటగిరీల్లో విధులు నిర్వర్తించే అధికా­రులు, సిబ్బందికి చెల్లించే రెమ్యునరేషన్‌ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ముఖ్య­కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ గురువారం ఉత్త­ర్వులు (జీవో 37) విడు­దల చేశారు. పరీక్షల నిర్వ­హణతో పాటు స్పాట్‌ వా­ల్యుయేషన్‌ (మూల్యాంకనం)లో పాల్గొనే వారంద­రి రెమ్యు­నరేషన్‌ను ప్ర­భు­­త్వం పెంచింది.
10th Class Exams
10th Class Exams
  • టెన్త్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో 26 కేటగిరీల్లో పనిచేసే వారి భృతి పెంపు 
  • పేపర్‌ సెట్టర్‌కు ఒక్కో పేపర్‌కు రూ.880 నుంచి రూ.1,320 చెల్లించేందుకు నిర్ణయం
  • అనువాదకులకు ఒక్కో పేపర్‌కు రూ.770 నుంచి రూ.1,155కి పెంపు
  • 10th class

     

చ‌ద‌వండి: టీం ఇండియా కెప్టెన్ నుంచి పోలీస్ అధికారిగా... రాజ్‌పాల్ సింగ్ ఎవ‌రో తెలుసా..?

10th class

ఎమ్మెల్సీ, వరీక్షల డైరెక్టర్‌ హర్షం
ఉత్తర్వులు ఇచ్చి­నందుకు సీఎం వైఎస్‌ జగన్, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారా­యణకు ఎమ్మెల్సీ టి.కల్పలత కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తమ డైరెక్టరేట్‌ తరఫున కృతజ్ఞతలు తెలి­యచేస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి పేర్కొ­న్నా­రు. 2016 తరువాత రెమ్యునరేషన్‌ ఇప్పుడే పెరిగిందని పీఆర్టీయూ రాష్ట్ర అధ్య­క్షుడు గిరిప్రసాద్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌­రెడ్డి తెలిపారు. ఈ నిర్ణయం పట్ల వైఎ­స్సా­ర్‌టీఎఫ్‌ నేత జాలిరెడ్డి ధన్య­వాదాలు తెలిపారు. 

చ‌ద‌వండి: నిరుద్యోగుల‌కు గుడ్‌న్యూస్‌... త్వ‌ర‌లోనే డీఎస్సీ నోటిఫికేష‌న్‌

Published date : 21 Apr 2023 04:04PM

Photo Stories