Skip to main content

10th Class Pass Marks: విద్యార్థులకు షాక్‌ ఇచ్చిన సర్కార్‌.. బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో పాస్‌ మార్కులపై క్లారిటీ

పదో తరగతి పరీక్షల్లో పాస్‌ మార్కుల విషయంలో పాత పద్దతినే కొనసాగిస్తామంటూ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో సైన్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులలో 20 మార్కులకే పాస్‌ చేసే విధానంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ మహారాష్ట్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. దీంతో రానున్న టెన్త్‌ బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో గతంలో మాదిరే సబ్జెక్టులలో పాస్‌ కావాలంటే 100కు 35 మార్కులు తప్పనిసరిగా రావాల్సిందే.
10th Class Pass Marks
10th Class Pass Marks Maharashtra State Board clarifies on pass marks

కాగా గతంలో మ్యాథ్‌మెటిక్స్‌తో పాటు సైన్స్‌ అంటే భయపడే విద్యార్థుల కోసం పాస్ మార్కులు తగ్గించాలని మహారాష్ట్ర విద్యా మండలి ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. పాస్ మార్కులను 20కి కుదించాలని కొత్త కురిక్యులమ్ ఫ్రేమ్ వర్క్‌లో సిఫార్సు చేసింది.

Central Govt Scholarships: సీబీఎస్‌ఈ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌ పూర్తి వివరాలు ఇవే..

అంతేకాకుండా ఇలా 20 మార్కులతో గట్టెక్కే వారి మార్క్‌ షీట్స్‌లో ఇంటర్ లేదా ఇతర ఉన్నత విద్యలో వారు గణితం లేదా సైన్స్ కోర్సులలో మాత్రం చేరడానికి అర్హులు కాదని రాస్తారు. ఇదంతా బాగానే ఉన్నా రానున్న ఫిబ్రవరి/మార్చి2025లో జరగనున్న బోర్డ్‌ ఎగ్జామ్స్‌లో ఈ విధానం అమల్లోకి వస్తుందా లేదా అనే సందేహంపై తాజాగా మహారాష్ట్ర బోర్డు కార్యదర్శి దేవీదాస్ కులాల్ క్లారిటీ ఇచ్చారు.

Deepfake Technology: డీప్‌ ఫేక్‌లో ఏదైనా ఫేక్‌ చేయొచ్చు.. ఇలా గుర్తించండి!

ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనాసాగిస్తామని, ఒకవేళ భవిష్యత్‌లో ఇలాంటి మార్పులు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా విద్యార్థులకు, తల్లిదండ్రులకు, ఉపాథ్యాయులకు ప్రత్యేకంగా ఈ విషయంపై తెలియజేస్తామని స్పష్టం చేశారు. 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 25 Nov 2024 05:49PM

Photo Stories