Skip to main content

Gurukulam Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

సింహాచలం: జిల్లాలోని మహాత్మా జ్యోతీబాఫూలే ఆంధ్రప్రద్రేశ్‌ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో 2024–25 సంవత్సరానికి గాను 5వ తరగతి, ఇంటర్‌ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని విశాఖపట్నం జిల్లా కన్వీనర్‌ సత్యారావు తెలిపారు.
Gurukulam Admissions Started In Andhra Pradesh

5వ తరగతికి సంబంధించి సింహాచలం బాలుర గురుకుల పాఠశాలలో 160 సీట్లు, పెద నరవ బాలురు పాఠశాలలో 80 సీట్లు, అన్నవరం(అమృతపురం) బాలికల పాఠాశాలలో 40 సీట్లు ఉన్నాయని పేర్కొన్నారు. విద్యార్థులు సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 3,4 తరగతులు చదివి ఉండాలని తెలిపారు. 
తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రూ.లక్షలోపు ఉండాలన్నారు. బీసీ, ఈబీసీ అభ్యర్థులు 1.09.2013 నుంచి 31.08.2015 మధ్య, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 1.09.2011 నుంచి 31.08.2015 మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఏప్రిల్‌ 27న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు mjpapbcwseir.apcfss.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలన్నారు.

Half day Schools 2024 : స్కూల్‌ పిల్ల‌ల‌కు గుడ్‌న్యూస్‌.. ఒంటిపూట బడులు ప్రారంభం.. ఎప్పటి నుంచి అంటే..?

సింహాచలం బీసీ కళాశాలలో..
హాచలం బీసీ గురుకుల కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని దాసరి సత్యారావు తెలిపారు. ఎంపీసీలో 60 సీట్లు, బైపీసీలో 40 సీట్లు, సీఈసీలో 40 సీట్లు ఉన్నాయన్నారు. 75 శాతం సీట్లు ఎంజేపీఏపీబీసీఆర్‌ స్కూల్స్‌, బీసీ హాస్టల్లో పదో తరగతి చదివిన విద్యార్థులకు, మిగిలిన 25 శాతం ఇతరులకు కేటాయించడం జరుగుతుందని తెలిపారు. ఏప్రిల్‌ 13న ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలిపారు.

Published date : 05 Mar 2024 05:39PM

Photo Stories