Tenth Exams: టెన్త్ పరీక్ష కేంద్రాల మార్పుపై దృష్టి
ఇంటర్మీడియెట్ పరీక్షల షెడ్యూల్ మారిన నేపథ్యంలో టెన్త్ పరీక్ష కేంద్రాల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచనలు జారీ చేశారు. టెన్త్ పబ్లిక్ పరీక్షలు మే 2 నుంచి 13వ తేదీవరకు నిర్వహించేలా షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంటర్మీడియట్ పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 28 వరకు నిర్వహించాలని తొలుత నిర్ణయించినా.. జేఈఈ మెయిన్ పరీక్షల నేపథ్యంలో ఏప్రిల్ 22 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్ బోర్డు షెడ్యూల్ ప్రకటించింది.
చదవండి: స్డడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సిలబస్ | మోడల్ పేపర్స్ | ప్రీవియస్ పేపర్స్ | టెక్స్ట్ బుక్స్
టెన్త్ పరీక్షల సమయంలోనే ఇంటరీ్మడియెట్ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఇంటరీ్మడియెట్ కాలేజీ భవనాలను టెన్త్ పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించి ఉన్నా, లేదా హైసూ్కల్ భవనాలను ఇంటర్ పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించి ఉన్నా ఒకే సమయంలో పరీక్షలు జరగనున్నందున ఇబ్బందులు ఎదురవుతాయి. అందువల్ల ఇంటరీ్మడియెట్ కాలేజీ భవనాల్లో టెన్త్ పరీక్ష కేంద్రాలు నిర్ణయించి ఉంటే వాటికి ప్రత్యామ్నాయంగా ఇతర భవనాలను ఎంపిక చేసే అంశాలను పరిశీలించాలని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి.దేవానందరెడ్డి డీఈవోలకు సూచించారు.