School leadership: ముగిసిన తొలి విడత ‘స్కూల్ లీడర్ షిప్’ శిక్షణ
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయుల్లో నాయకత్వం పెంపొందించేందుకు చేపట్టిన ‘స్కూల్ లీడర్ షిప్’ తొలివిడత (ఫస్ట్ స్పెల్) కార్యక్రమం జూలై 23తో ముగిసినట్టు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు.
పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా (సీమ్యాట్) ఆధ్వర్యంలో జూలై 18 నుంచి విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురం, బాపట్ల, విజయవాడ కేంద్రాలుగా 1400 మంది హెచ్‌ఎంలకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. రెండో విడతలో భాగంగా జూలై 24న నుంచి మరో 1400 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు.
చదవండి: CBSE Classes in Local Languages: పాఠశాలలు ఇప్పుడు ప్రాంతీయ భాషలలో బోధించవచ్చు!
రాష్ట్ర వ్యాప్తంగా 14 వేల మంది హెచ్‌ఎంలు విడతల వారీగా పాల్గొంటారని తెలిపారు. ‘స్కూల్ లీడర్ షిప్’ మాడ్యూల్‌ను అనుసరించి ప్రధానోపాధ్యాయులు పాఠశాలలను నిర్వహించాలని సూచించారు.
Published date : 24 Jul 2023 12:49PM