AP Sankranthi Holidays 2023: గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగింపు.?
Sakshi Education
దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడ ఉన్నాసరే సంక్రాంతి పండగకు వారి సొంత ఊరికి వచ్చి కుటుంబ సభ్యులు, గ్రామస్థులతో పండగను జరుపుకుంటారు.
కాగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అయితే దీనిపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, ఉపాధ్యాయ సంఘాలు పలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. గతంలో కనీసం 10 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇచ్చేవారని.. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల రిత్యా వాటిని తగ్గించడం సరికాదని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణను కోరాయి. దీనిపై మంత్రి కూడా సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య, రాష్ట్రోపాధ్యాయ సంఘాలు వివరించారు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగించే అవకాశం ఉన్నట్లు ఆశాబావం వ్యక్తమవుతోంది.
AP Sankranthi Holidays 2023 : ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు ఎప్పుటి నుంచి అంటే..
Published date : 03 Jan 2023 02:50PM