Tenth Class Public Exams 2024: ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం
Sakshi Education
ముగిసిన పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకనం
నంద్యాల: 2023–24 విద్యాసంత్సరానికి సంబంధించి ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో ఈనెల 1వ తేదీ నుంచి ప్రారంభమైన పదవ తరగతి మూల్యాంకనం ఆదివారం ముగిసింది. జిల్లాకు 1,91,422 సమాధాన పత్రాలు రాగా 120 మంది చీఫ్ ఎగ్జామినర్స్, 718 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 195 మంది ప్రత్యేక సహాయకులతో మొత్తం 1,033 మంది సిబ్బందితో విజయవంతంగా మూల్యాంకనాన్ని ముగించామని డీఈఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. సార్వత్రిక ఎన్నికల శిక్షణలో భాగంగా పీఓ, ఏపీఓ ఆర్డర్స్ వచ్చిన వారు ఈనెల 15, 16న వారికి కేటాయించిన కేంద్రాల్లో శిక్షణకు తప్పకుండా హాజరు కావాలని డీఈఓ సూచించారు.
Published date : 08 Apr 2024 11:20AM
Tags
- AP Tenth Class Public Exams evaluation 2024
- Bseap
- Board Of Secondary Education Andhra Pradesh
- Tenth Class Public Exams evaluation 2024
- Tenth Class Annual exams2024 evaluation
- Evaluation of the concluded Class X Public Examinations
- AP Tenth Class
- NandyalaDistrict
- Class 10 evaluation
- Academic year 2023-24 evaluation
- Successful completion of evaluation
- Sakshi Education Updates