‘పలాసలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు కృషి’
ఆయన సెప్టెంబర్ 24న పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ చినబడాంలో ఉన్న ఆర్మీ క్యాంటీన్ సందర్శించారు. అనంతరం మాజీ సైనికులు, వీర మహిళలు, వీర మాతృమూర్తులతో సమావేశమయ్యారు. పలాసలో ఆర్మీ కుటుంబాల పిల్లల కోసం కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేస్తే ఎంతో మేలు జరుగుతుందని కొందరు ప్రతిపాదించారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఆర్మీ ఉన్నత అధికారులకు సమాచారం చేరవేసి పూర్తి అనుమతులు పొంది ఏర్పాటుకు సన్నాహాలు చేస్తామని మాటిచ్చారు.
చదవండి: UGC Latest Guidelines: పీహెచ్‌డీ లేకున్నా.. అసిస్టెంట్ ప్రొఫెసర్!
రానున్న రోజుల్లో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు పై స్పష్టత ఇస్తామని, వైద్య సేవలు నిమిత్తం పోలీ క్లినిక్‌పై చర్చిస్తామని అన్నారు. ఆయనతో పాటు సికింద్రాబాద్ ఆర్మీ యూనిట్ అధికారులు కూడా వచ్చారు. ఈ సందర్భంగా పలాస మాజీ సైనిక సంక్షేమ సంఘం ఇచ్చిన గౌరవ వందనాన్ని కమాండర్ స్వీకరించారు. కార్యక్రమంలో పలాస మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఇళ్ల మన్మధరావు, సభ్యులు బంగారు బారికి, ఆర్మీ క్యాంటీన్ మేనేజర్, కార్యవర్గ సభ్యులు, సిబ్బంది మాజీ సైనికులు, మాజీ అధికారులు, వీర మహిళలు, వీర మాతృమూర్తులు తదితరులు పాల్గొన్నారు.