Minister of Education: వేసవి సెలవుల్లోనే పాఠశాలలకు విద్యా కానుక
Sakshi Education
ప్రభుత్వ పాఠశాలల్లో 1నుంచి 10వ తరగతి విద్యార్థులకు మూడో విడత జగనన్న విద్యా కానుక కిట్లను 2022 విద్యా సంవత్సరం ప్రారంభంలోనే అందజేయాలని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులను ఆదేశించారు.
ఇందుకు అవసరమైన టెండర్ల ప్రక్రియను త్వరగా పూర్తిచేసి ఏజెన్సీలకు వర్క్ ఆర్డర్లు జారీ చేయాలన్నారు. జనవరి 4న సచివాలయంలో విద్యా శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి సురేష్ మాట్లాడుతూ వేసవి సెలవుల్లోనే విద్యాకానుక కిట్లు పాఠశాలలకు చేరేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న అమ్మ ఒడి, విద్యాదీవెన పథకాలకు అర్హుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. నాడు–నేడు పథకం కింద పాఠశాలల్లో మౌలిక వసతుల మెరుగుదల, క్రీడా ప్రాంగణాల అభివృద్ధి పనుల పురోగతిపై ఆరా తీశారు. విద్యా సంస్కరణల్లో భాగంగా తీసుకొస్తున్న ఫౌండేషన్ స్కూళ్ల అమలుకు ప్రభుత్వ పాఠశాలలు, టీచర్ల మ్యాపింగ్, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల భర్తీపై చర్చించారు.
చదవండి:
High Court: ఆ విద్యార్థులకు 25 శాతం సీట్లివ్వండి
Education: విద్యకు పెద్దపీట.. ప్రైవేట్ వర్సిటీల్లో పేదలకు సీట్లు..
Published date : 05 Jan 2022 12:29PM