Skip to main content

Education: విద్యకు పెద్దపీట.. ప్రైవేట్ వర్సిటీల్లో పేదలకు సీట్లు..

రాష్ట్రంలో విద్యారంగం ఏటేటా మెరుగవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి చేపడుతున్న అనేక పథకాలు ఫలితాలు సాధిస్తున్నాయి.
Education
విద్యకు పెద్దపీట..

కరోనా వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ విద్యారంగ ప్రగతిలో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్‌ క్రమేణా వివిధ విభాగాల్లో ర్యాంకులను సాధిస్తోంది. 2021లో విద్యారంగంలో పలు కార్యక్రమాలను ప్రభుత్వం పూర్తి చేయించింది. మనబడి నాడునేడు కింద తొలివిడత స్కూళ్లలో అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. దాదాపు రూ. 3,650 కోట్లతో 15,715 స్కూళ్లను ఈ పథకం కింద అభివృద్ధి చేశారు. ప్రభుత్వ స్కూళ్లన్నిటిలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు. దీనిని 96 శాతానికి పైగా విద్యార్థులు స్వాగతించారు. ఉన్నత విద్యారంగంలోనూ అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమల్లోకి వచ్చాయి.

ర్యాంకుల పంట

  • ఇటీవల ప్రధానమంత్రి ఎకనమిక్‌ అడ్వయిజరీ కౌన్సిల్‌ విడుదల చేసిన నివేదికలో పాఠశాల విద్య అందుబాటులో ఏపీ 38.50 పాయింట్లతో దేశంలో అగ్రగామిగా నిలిచింది.  
  • కేంద్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 2021 గుడ్‌ గవర్నె¯Œ్స ఇండెక్స్‌ నివేదిక కూడా  హ్యూమన్ రిసోర్సు డెవలప్‌మెంట్‌ విభాగంలో ఏపీ ప్రగతిని స్పష్టంగా చూపింది. నాణ్యమైన విద్యను అందించడంలో రాష్ట్రం గతంలో కన్నా ఎంతో మెరుగైన స్థానంలో నిలిచిందని ఆ నివేదిక పేర్కొంది. 1.20 గరిష్ట పాయింట్లలో ఏపీ 2019–20లో 0.47 సాధించగా 2021లో 0.76 పాయింట్లతో పురోగతిని సాధించింది. 
  • ఎస్సీ, ఎస్టీలకు విద్య అందుబాటులోకి వచ్చి వారి చేరికలు కూడా పెరిగాయి. ఈ విభాగంలో గతంలో 0.43 పాయింట్లతో ఉన్న ఏపీ 2020–21లో 0.47 పాయింట్లను సాధించింది. 
  • నైపుణ్యాభివృద్ధిలో 120 గరిష్ట పాయింట్లలో 2019–20లో 92.29 పాయింట్లు సాధించగా 2020–21లో 98.45 పాయింట్లతో పురోగతిని సాధించింది. 
  • ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో.. ప్లేస్‌మెంట్లలో 2019–20లో 54.78 పాయింట్లలో నిలవగా 2020–21లో 58.74 పాయింట్లతో ముందడుగు వేసింది.

ప్రైవేట్‌ వర్సిటీల్లో పేదలకు సీట్లు..

ప్రైవేట్‌ వర్సిటీల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా పేద, బడుగు, బలహీనవర్గాలకు సీట్లు కేటాయించారు. వీఐటీ, ఎస్‌ఆర్‌ఎం, సెంచూరియన్, బెస్ట్‌ తదితర ప్రైవేట్‌ వర్సిటీల్లోని 35 శాతం సీట్లను కనీ్వనర్‌ కోటా కింద ప్రవేశ పరీక్షల్లో మెరిట్‌ సాధించిన పేదలకు కేటాయించారు. డిగ్రీ కోర్సులను నాలుగేళ్ల హానర్స్‌గా మార్పు చేయించి విద్యార్థులకు మూడేళ్లలో ఎగ్జిట్‌కు అవకాశం కలి్పంచారు. పది నెలలపాటు ఇంటర్న్‌íÙప్‌ను తప్పనిసరి చేశారు. విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలు కలి్పంచడానికి వీలుగా మైక్రోసాఫ్ట్‌ వంటి అంతర్జాతీయ సంస్థలతో వివిధ కోర్సులను ప్రవేశపెట్టించారు.

చదవండి: 

YouTube: యూట్యూబ్‌ టాపర్లు వీరే.. చదువు, గేమ్‌లు నుండి వినోదం వరకు..

జాతీయ నైపుణ్య పోటీలకు 30 మంది ఎంపిక

Published date : 31 Dec 2021 12:40PM

Photo Stories