చిట్టి తల్లులకు ‘స్వేచ్ఛ’.. 10 లక్షల మంది బాలికలకు ఇవి పంపిణీ
రేపటి పౌరులైన కిశోర బాలికల ఆరోగ్యంపైనా ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. సమర్థవంతంగా మెన్‌స్ట్రువల్ హైజీన్ (బహిష్టు సమయంలో పరిశుభ్రత) కార్యక్రమాల అమలులో కూడా మన రాష్ట్రం రెండో స్థానంలో ఉంటోంది. ఈ అంశాన్ని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. నెలసరి సమయంలో స్కూళ్లు, కళాశాలల్లో చదివే విద్యార్థినులు పడే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ‘స్వేచ్ఛ’ కార్యక్రమం ద్వారా శానిటరీ నాప్‌కిన్లను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తోంది. ఇలా 2021–22లో 1.48 కోట్ల శానిటరీ నాప్‌కిన్ల పంపిణీతో తమిళనాడు దేశంలో మొదటి స్థానంలో ఉండగా, 1.16 కోట్లతో ఏపీ రెండో స్థానంలో ఉంది.
చదవండి: Best School: ఉత్తమ పాఠశాల.. రైల్వేస్కూల్
ప్రతీనెలా 10 లక్షల మంది బాలికలకు..
రుతుక్రమం ఇబ్బందులతో బాలికలు స్కూలుకు దూరమవుతున్న పరిస్థితులను సీఎం జగన్ ప్రభుత్వం గుర్తించింది. డ్రాపౌట్స్‌ను తగ్గించడంతో పాటు, బాలికలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా స్వేచ్ఛ కార్యక్రమాన్ని 2021లో ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఏడు నుంచి ఇంటర్మీడియట్ చదువుతున్న 10,01,860 మంది బాలికలకు ప్రతినెలా 10 నాణ్యమైన, బ్రాండెడ్ శానిటరీ నాప్‌కిన్లను ఉచితంగా అందిస్తున్నారు. ఇందుకోసం ఏటా ప్రభుత్వం రూ.30 కోట్ల మేర ఖర్చుచేస్తోంది. అంతేకాక.. ఎదుగుతున్న సమయంలో శరీరంలో వచ్చే మార్పుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, ఫ్యామిలీ డాక్టర్ల ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
చదవండి: BR Ambedkar: ఆకాశమంత అంబేడ్కరుడు.. విగ్రహం విశేషాలు ఇవే!
ప్రత్యేకంగా అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు..
ఇక కౌమార దశలో ఎదురయ్యే ఆరోగ్య సమస్యల నివృత్తికి,వైద్యసేవలు అందించేందుకు అన్ని ప్రభుత్వ వైద్యశాలల్లో అడోలసెంట్ ఫ్రెండ్లీ క్లినిక్‌లు నిర్వహిస్తున్నారు.
చదవండి: Admissions: గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
అపరిశుభ్ర పద్ధతులతో సమస్యలివే..
- నెలసరిలో వస్త్రాన్ని వాడే విధానాన్ని అపరిశుభ్ర పద్ధతిగా వైద్యులు చెబుతారు. ఇలా వాడటంతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్లు వస్తాయి.
- జననాంగంలో రక్షణకు అవసరమైన హైడ్రోజన్ పెరాక్సైడ్‌ను స్రవించే లాక్టోబాసిల్లై అనే మంచి బ్యాక్టీరియాతో పాటు కొద్దిమోతాదులో వేరే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. వస్త్రం వంటి అపరిశుభ్ర పద్ధతులతో జననాంగం సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు ఏర్పడ్డాక సంతానలేమి, శృంగారంతో ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే పెలి్వక్ ఇన్‌ఫ్లమేటరీ వ్యాధులొస్తాయి. హానికరమైన బ్యాక్టీరియాతో యూరినరీ ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. సంతానలేమి సమస్యలు తలెత్తుతాయి.