Digital Education: విద్యార్థులకు అర్థమయ్యేలా బోధన చేయాలి
బుధవారం ఆయన నందవరం, పెద్దకడబూరులలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలను తనిఖీ చేశారు. టీచింగ్ స్టాఫ్ పాఠ్యాంశాల ప్రణాళికలు, డైరీ, డైనింగ్ హాల్, స్టాక్ రిజిస్టర్లు, విద్యార్థినుల నోటుబుక్స్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లోకి వెళ్లి పిల్లల విద్యా సామర్థ్యాలను పరీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 8వ తరగతి విద్యార్థులు ప్రభుత్వం అందించిన ట్యాబులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. డిజిటల్ విద్యపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని టీచర్లకు సూచించారు. విద్యార్థులు పరీక్షలపై భయం వీడాలని అప్పుడే మంచి మార్కులొస్తాయన్నారు. ఎండ తీవ్రత పెరుగుతుండటంతో ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని విద్యార్థులకు సూచించారు. పెద్దకడబూరు కేజీబీవీలో స్టాక్ వివరాలు సరిగ్గా లేకపోవడంతో ప్రిన్సిపాల్ చైతన్య స్రవంతిపై మండిపడ్డారు. ఆయా పాఠశాలల తనిఖీలో గర్ల్స్ చైల్డ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సునీత, ఎంఐఎస్ కోఆర్డినేటర్ లక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు.