Tenth students: టెన్త్ విద్యార్థుల వివరాలు సరిచూసుకోండి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే మార్చి 18 నుంచి జరిగే ఎస్‌ఎస్‌సీ, ఓఎస్‌ఎస్‌సీ, ఒకేషనల్ పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల వివరాలు ఆన్‌లైన్‌లో ఉన్నాయని, వాటిని సరిచూసుకోవాలని ఏలూరు డీఈఓ పి.శ్యామ్‌సుందర్ ప్రభుత్వ, జెడ్పీ, మున్సిపల్, ఎయిడెడ్, అన్‌ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థులు నమోదు చేసిన వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి ఈనెల 16 నుంచి 20 వరకు అవకాశం కల్పించారన్నారు.
Also Read : AP 10th Class 2024 Timetable
ఈ మేరకు స్కూల్ లాగిన్‌లో విద్యార్థుల వివరాలు సవరించుకోవచ్చన్నారు. విద్యార్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, ప్రథమ భాష, ద్వితీయ భాష, పరీక్షా మాధ్యమం, వైకల్యం, ఓఎస్‌ఎస్‌సీ సబ్జెక్టు, కోడ్, ఒకేషనల్ ఎస్‌ఎస్‌సీ సబ్జెక్టు, కోడ్, గుర్తింపు చిహ్నాలు, విద్యార్థుల ఫొటోలు, సంతకాలు మాత్రమే సవరించుకునే వీలుందన్నారు.