School Education Department: స్కూళ్ల రికార్డుల్లో మార్పులకు అనుమతిలేదు
Sakshi Education
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన పలు వివరాలను రికార్డుల్లో ఉన్నతాధికారుల అనుమతి లేకుండా మార్పు చేయడానికి వీల్లేదని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అన్ని స్కూళ్ల హెడ్మాస్టర్లకు ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసింది.
స్కూళ్ల రికార్డుల్లో మార్పులకు అనుమతిలేదు
పాఠశాలల్లోని విద్యార్థుల పేర్లు, ఇతర వివరాలను రికార్డుల్లో నమోదు చేసిన అనంతరం కొన్ని చోట్ల అనుమతి లేకుండా ఇష్టానుసారంగా మార్పులు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని అందులో పేర్కొన్నారు.