Venugopal: విద్యాశాఖ ఏడీగా వేణుగోపాల్
Sakshi Education
ఆదిలాబాద్ టౌన్: జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్(ఏడీ)గా ఎస్.వేణుగోపాల్ నియమితులయ్యారు. నిజామాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ఈయనకు ఏడీగా పదోన్నతికల్పిస్తూ పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ జనవరి 12న ఉత్తర్వులు జారీ చేశా రు. ఇక్కడ ఏడీగా పనిచేసిన నర్సింలు ఉద్యోగ విరమణతో ఆ పోస్టు ఖాళీగా మారింది.

డైట్ కళాశాల సూపరింటెండెంట్‌కు పదోన్నతి..
ఆదిలాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న డి.భోజన్నకు విద్యాశాఖ ఏడీగా పదోన్నతి లభించింది. ఈయనకు జనగామ జిల్లా విద్యాశాఖలో ఏడీగా పోస్టింగ్ కల్పించారు.
పదోన్నతి లభించడంపై డైట్ కళాశాల ఉద్యోగులు, సిబ్బంది, జిల్లా విద్యా శాఖ సిబ్బంది అభినందనలు తెలిపారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |
Published date : 15 Jan 2025 08:53AM