నెల్లిమర్ల: రామతీర్థం కూడలిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి సెప్టెంబర్ 26న ఆకస్మికంగా తనికీ చేశారు.
అభ్యసనా సామర్థ్యాల పరిశీలన
విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పరిశీలించారు. కొందరు విద్యార్థుల్లో సామర్థ్యాలు లోపించడంతో ఉపాధ్యాయులను ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యకోసం రూ.కోట్లు ఖర్చుచేస్తుంటే ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహించడం సరికాదన్నారు. బోధన సామర్థ్యాలు మెరుగుపరచకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట డైట్ ప్రిన్సిపాల్ ఎన్.టి.నాయుడు, ఎంఈఓ మూర్తి ఉన్నారు.