Skip to main content

‘పది’ గణితం పరీక్షకు 298 మంది గైర్హాజరు

పుట్టపర్తి టౌన్‌/ గోరంట్ల: పదో తరగతి పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ 10న‌ 125 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నిర్వహించారు.
298 people were absent for the tenth maths exam
‘పది’ గణితం పరీక్షకు 298 మంది గైర్హాజరు

24,616 మందిగాను 24,318 మంది హాజరయ్యారు. వివిధ కారణాలతో 298 మంది గైర్హాజరయ్యారు. గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి సమీపంలోని ఉదయ్‌కిరణ్‌ ఇంగ్లిష్‌ మీడియం పాఠశాల, గోరంట్లలోని బాలుర, బాలికల పాఠశాలల్లోని కేంద్రాలు, ఉర్దూ ఉన్నత పాఠశాల, వివేకానంద ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలోని పరీక్ష కేంద్రాలను కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు, పరీక్షా కేంద్రాల్లో సౌకర్యాలపై ఆరా తీశారు. ముఖ్యంగా గాలి వెలుతురు సరిగా ఉండేలా చూడడంతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించాలని అధికారును ఆదేశించారు.

చదవండి:

EAMCET 2023: ఎంసెట్‌కు ఇన్ని లక్షల దరఖాస్తులు.. ఈసారి పరీక్ష ఇలా..

TSPSC: ‘అడ్డదారి అభ్యర్థుల’ గుర్తింపే లక్ష్యం

9,231 Jobs: అవరోహణ విధానంలో గురుకుల పోస్టుల భర్తీ

Fake Job Notification: ఉద్యోగాల పేరుతో నకిలీ వెబ్‌సైట్‌

Published date : 11 Apr 2023 04:19PM

Photo Stories