Skip to main content

రోదసి అంటే ఏమిటి?

Tenth Classరోదసి అనే మాటను మనం తరచూ వింటుంటాం! రోదసిలో ప్రయాణించారని, రోదసిలో ప్రవేశపెట్టారని అంటుంటారు. అసలింతకూ ‘రోదసి’ అంటే ఏమిటి?

‘రోదసి’ (SPACE)హద్దులు లేని అనంతమైన శూన్యప్రదేశం. భూమికి నలువైపులా గాలి దుప్పటిలా ఆవరించుకుని వుంటుంది. దీన్ని ‘వాతావరణం’ అంటారు. ఇంకా చాలా పైకి వెళ్లినకొద్దీ వాతావరణం పలచబడుతుంది.

మరీ పైకి వెళితే కదిలే వస్తువులపై ఏ ఘర్షణశక్తినీ కల్పించలేనంత పలచన అవుతుంది. దీన్ని వాతావరణ హద్దు అంటారు.

భూవాతావరణాన్ని దాటిన తర్వాత వుండే విశాలమైన ప్రాంతాన్ని ‘రోదసి’ లేక ‘అంతరిక్షం’ అంటారు. భూ ఉపరితలం నుండి 1000 కిలోమీటర్లు పైన ఉన్న భాగాన్ని శాస్త్రజ్ఞులు ‘రోదసి’ అని వ్యవహరిస్తున్నారు.

రోదసి అన్ని దిశలకు, సూర్యకుటుంబం, పాలపుంతలు, వాటి ప్రదేశాలు, ఇంకా మనకు తెలియనంత, మానవుడు కొలవలేనంత దూరం వ్యాపించి వుంది.

రోదసిని ‘అంతర్ గ్రహ రోదసి’, ‘అంతర్ తారక రోదసి’, ‘అంతర్ రోదసి నక్షత్ర మండలం’ అని కొన్ని భాగాలుగా విభజించారు.

రోదసిని గురించి నిరంతరం అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి.
Published date : 13 Nov 2013 10:23AM

Photo Stories