Skip to main content

పాము కుబుసం ఎందుకు వదులుతుంది?

Tenth Classపాము చర్మంలో ఉండే ఒక ప్రత్యేక గుణం వల్ల అవి కుబుసం వదులుతాయి. పాము ప్రాణాలతో జీవించి ఉన్నంతవరకూ వీటి శరీరం కొంచెం కొంచెంగా పెరుగుతూనే ఉంటుంది. ముసలి వయసులో కూడా పాములలో పెరుగుదల ఉంటుంది, కానీ ఈ పెరుగుదల శాతం తక్కువగా ఉంటుంది. పాము శరీరం పెరగగానే దాని చర్మం కురచ అవుతుంది. కాబట్టి కురచ అయిన చర్మాన్ని అది వదిలేస్తుంది. దీన్నే కుబుసం విడవడం, కుబుసం వదలడం అంటారు.
పాములు ఒకటి నుండి మూడు నెలలకొకసారి కుబుసం వదులుతాయి. కుబుసం వదలడమన్నది ఆయా జాతి పాములపై ఆధారపడివుంటుంది.
పాము గరుకుగా ఉన్న ప్రదేశానికి శరీరాన్ని ఒరిపిడి చేసి కుబుసం వదులుతుంది. ఇది పారదర్శకంగా ప్లాస్టిక్ పేపరులా ఉండి మిలమిలమెరుస్తూ ఉంటుంది.
పాము కుబుసం వదులుతున్నప్పుడు చర్మం లోపలి భాగం బయటకు, వెలుపలి భాగం లోపలికి మారుతుంది. కాబట్టి కుబుసం చిరగదు. చర్మానికి కూడా ఎలాంటి గాయాలు కావు. పాములలో 2400 రకాలకు పైగా ఉన్నాయి. ఈ అన్ని జాతులు కుబుసం విడిచే లక్షణం కలిగి ఉంటాయి.
Published date : 13 Nov 2013 10:57AM

Photo Stories