Skip to main content

మట్టి ఎలా ఏర్పడింది?

Tenth Classమట్టి వల్ల మనకు అనేక ఉపయోగాలు వున్నాయి. మొక్క లు, చెట్లు పెరగటానికి మట్టి అవసరం. మట్టిని నివాసంగా చేసుకుని లక్షలు, కోట్ల సంఖ్యలో జీవరాశులు జీవిస్తాయి.

భూమిపైన పొరలా ఏర్పడే కొన్ని అణువుల కలయికతో ఏర్పడిన పదార్థమే మట్టి. మట్టి ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది.

మట్టిలో రాళ్లు, ఖనిజాలు, మూలకాలు, నీరు, గాలి కలిసి వుంటాయి. లక్షల సంవత్సరాల పూర్వం మట్టి రాళ్లరూపంలో వుండేది. అప్పటి నుంచి గాలి, వాన, మంచు, ఎండ మొదలైన ప్రకృతిశక్తుల ప్రభావం వల్ల రాళ్లు చిన్నచిన్న ముక్కలుగా అయ్యాయి. ఈ ప్రకృతి శక్తులే రాళ్ల తునకలను ఇసుకగా మార్చాయి. బ్యాక్టీరియా, కార్బనిక్ ఆమ్లం, ఇతర సూక్ష్మజీవులు కలిసి ఇసుకను మట్టిగా మార్చాయి. తర్వాత కాలంలో చచ్చిన మొక్కలు, పశువులు బ్యాక్టీరియా వల్ల మట్టిగా మారాయి. ఈ విధంగా ఏర్పడిన మట్టి... జంతువులు, మొక్కలు, కీటకాలు, వానపాములు మొదలైన జీవుల ప్రభావం వల్ల మరింత సారవంతం అవుతుంటుంది.
Published date : 13 Nov 2013 10:32AM

Photo Stories