Skip to main content

మనిషి చనిపోయినా వెంట్రుకలు పెరుగుతాయా?

Tenth Classమనిషి చనిపోవడంతో జీవక్రియలు అన్నీ ఆగిపోతాయి. అయితే మనిషి చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం వరకు వెంట్రుకలు పెరుగుతూనే వుంటాయి. దీనికి కారణం వెంట్రుకల నిర్మాణంలో ఉన్న ప్రత్యేకత.

వెంట్రుకలో నాలుగు భాగాలు వుంటాయి. ఒకటి పైన కనిపించే భాగం. దీన్ని షాఫ్ట్ (SHAFT)అంటారు. రెండవది వెంట్రుక మొదలు (ROOT), దీని కిందచర్మం లోపల చిన్న సంచి వంటిది ఉంటుంది. దీన్ని రోమకూపం (Hair follicles)అంటారు. నాలుగవది రోమకూపానికి కింద వుండే రోమ బుడిపె. ఈ బుడిపెలోని కణాలు విభజన పొందడం వల్ల వెంట్రుకలు ఏర్పడి వృద్ధిపొందుతుంటాయి. రోమకూపంలో కొత్త కణాలు ఏర్పడటం వల్ల వెంట్రుక పెరుగుతుంది. బుడిపెలోకి కొత్త కణాలు వచ్చి పాతవాటిని బయటకు నెడుతుంటాయి. ఆవిధంగా జుత్తు పెరగడం కనిపిస్తుంటుంది. మనిషి చనిపోయిన తర్వాత కూడా కొంతకాలం జుట్టు పెరుగుతుంటుంది. ఎందుకంటే రోమకూపంలోని కణాలు వెంటనే చనిపోవు. వాటిలో ఇంధనం వున్నంతవరకూ అవి వృద్ధి పొందుతూనే వుంటాయి. కణాలు పనిచేస్తున్నంతవరకూ వెంట్రుకలు పెరుగుతుంటాయి. కణాలలోని ఇంధనం పూర్తిగా అయిపోగానే వెంట్రుకలు పెరగడం ఆగిపోతాయి.
Published date : 13 Nov 2013 10:25AM

Photo Stories