మైనం ఎలా తయారవుతుంది?
Sakshi Education
మైనం (WAX)ను నాలుగు రకాలుగా విభజించవచ్చు ఖనిజాలలో లభించే మైనం, జంతువుల కొవ్వుతో తయారయ్యే మైనం, వృక్ష సంబంధమైన మైనం, సింథటిక్ లేదా కృత్రిమ మైనం. పారాఫిన్ అనేది ఖనిజాల నుండి లభించే మైనం. ఇది చాలా గట్టిగా వుంటుంది. పెట్రోలియం జెల్లీ కూడా మెత్తటి మైనమే. తేనెటీగల పట్టునుండి లభించే మైనం జంతు సంబంధమైన మైనం. ఉన్ని వుండే జంతువుల నుండి లభించే మైనాన్ని ‘‘లైనోలిస్’’ అంటారు. దీన్ని శుద్ధి చేసి వాడుతారు. మొక్కల నుండి కూడా మైనం లభిస్తుంది. బ్రెజిల్లో కార్నోబా చెట్టు నుండి కార్నొబా మైనం లభిస్తుంది. మెక్సికో, అమెరికాలలో కాండెల్లిలా చెట్టునుండి కాండెల్లిలా మైనం లభిస్తుంది. సింథటిక్ అంటే కృత్రిమమైనాన్ని హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, క్లోరిన్ల నుండి తయారుచేస్తారు.
Published date : 13 Nov 2013 10:19AM