మానవ దేహానికి సూర్యరశ్మి వల్ల ప్రయోజనం ఏమిటి?
Sakshi Education
సూర్యరశ్మి వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. శరీరం లో విటమిన్ ‘ఇ’ ని సూర్యరశ్మి ఉత్తేజి తం చేస్తుంది. దీనివల్ల ఎముకలు బలంగా అవుతా యి. మానవ దేహంపై స్థిరనివాసం ఏర్పరచుకొనగలిగే ఎన్నో ప్రమాదకరమైన ఫంగస్‌లను, బ్యాక్టీరియాలను సూర్యరశ్మి నాశనం చేసి, మానవదేహాన్ని ఎన్నోరకాల వ్యాధు ల నుండి కాపాడుతుంది. ఈ విధం గా సూర్యరశ్మిలో ఎన్నో ఔషధగుణాలు ఉన్నాయి.
సూర్యరశ్మి చర్మానికి రక్షణ కల్పిస్తుంది. తెల్ల రక్తకణాలను సూర్యరశ్మి బాగా ఉత్తేజపరుస్తుంది. మానవ దేహంలోని వ్యాధికారక క్రిములపై దండెత్తి దేహాన్ని ఆరోగ్యం గా ఉంచేవి తెల్లరక్తకణాలే, ఈ విధం గా శరీరానికి తగినంత సూర్యరశ్మి సోకడం ద్వారా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. సూర్యరశ్మి సోకడం వల్ల నాడీమండలం ఉత్తేజితం అవుతుంది. అందువల్లనే ఎండలో నిలుచున్నప్పుడు ఉత్సాహంగా అనిపిస్తుంది. చల్లదనంలో కంటే సూర్యరశ్మిలో రక్తప్రసరణ సజావుగా వుంటుంది. సూర్యరశ్మి వల్ల కండరాలు దృఢం గా అవుతాయి. అతిగా సూర్యరశ్మి తగిలితే శరీరానికి హాని కలుగు తుంది. ఇది తగుమాత్రంగానే అవసరం.

Published date : 13 Nov 2013 10:29AM