Skip to main content

కరెంట్ షాక్ ప్రమాదం ఎంత?

Tenth Classశరీరానికి కరెంటుషాక్ తగిలినపుడు దాని ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది శరీరంలో నుండి ప్రవహించిన విద్యుత్ మీద ఆధారపడి ఉంటుంది.

సుమారు 0.1 ఆంఫెర్ విద్యుత్తు గుండె ద్వారా ప్రవహిస్తే అది ప్రమాదకరం. ఎక్కువ విద్యుత్తు ఎక్కువసేపు శరీరంలో ప్రవహిస్తే ఎక్కువ ప్రమాదం కలుగుతుంది.

కరెంటు రెండు విధాలు. ఒకటి డెరైక్ట్ కరెంట్, రెండోది ఆల్టర్నేటింగ్ కరెంట్. ఆల్టర్నేటింగ్ కరెంట్ సెకనుకు 50 పర్యాయాలు దిశను మారుస్తుంది. ఈ విధమైన కరెంట్ వల్ల షాక్ ఎక్కువసేపు కలిగితే కండరాలు, శరీర కణాలు, నాడులు వీటిని పనిచేయకుండా ఆపేస్తుంది. శరీరంలో విద్యుత్ ప్రవహించడం వల్ల కండరాలు అదుపు చేయలేనంతంగా కుంచించుకుపోతాయి. దీనివల్ల శ్వాస ఆగిపోతుంది. గుండె పనిచేయదు. దీంతో మరణం సంభవించవచ్చు. ఎక్కువ విద్యుత్ ప్రవహిస్తే అధికమైన వేడికి శరీరకణాలు, నాడులు, కండరాలు నశించిపోతాయి.

విద్యుత్ ఉపకరణంలోని ధన, ఋణ ధ్రువాలను రెండుచేతులతో తాకితే విద్యుత్ గుండె నుండి ప్రవహిస్తుంది. అందువల్ల ఒక్క చేత్తోనే తాకాలి. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా కరెంట్ వస్తువులు ముట్టుకోరాదు.
Published date : 13 Nov 2013 10:28AM

Photo Stories