Skip to main content

కిండర్ గార్టెన్విద్యావిధానం ఎలా మొదలైంది?

Tenth Classకె.జి. అంటే కిండర్ గార్టెన్. ఎల్.కె.జి. అంటే లోయర్ కిండర్ గార్టెన్. యు.కె.జి. అంటే అప్పర్ కిండర్ గార్టెన్.

కిండర్‌గార్టెన్ విద్యావిధానాన్ని 19వ శతాబ్దంలో ప్రారంభించారు. దీన్ని కనిపెట్టినవారు బ్రిటన్‌కు చెందిన రాబర్ట్ ఓవన్, స్విట్జర్లాండ్‌కు చెందిన జె.హెచ్. పేస్టోలోజీ, జర్మనీకి చెందిన ఫ్రెడరిక్ ప్రోబెల్, ఇటలీకి చెందిన మరియా మాంటిస్సోరీ.

గ్రేట్‌బ్రిటన్‌లో పారిశ్రామిక విప్లవం అనంతరం బాలల విద్యకు అధిక ప్రాధాన్యం లభించింది. ఫ్యాక్టరీ ల చట్టాలు ఏర్పడి చిన్నపిల్లలను కార్మికులుగా చేర్చుకోడాన్ని నిషేధించడం, పిల్లల తల్లిదండ్రులు ఎక్కువ సమయం ఫ్యాక్టరీల్లోనే గడుపుతుండటంతో చిన్న పిల్లలు స్కూళ్లకు అధికప్రాధాన్యం లభించింది.

1816లో స్కాట్‌లాండ్‌లో ని తన కర్మాగారంలో పనిచేసే కార్మికుల పిల్లల కోసం కె.జి. తరహా స్కూల్‌ను రాబర్ట్ ఓవన్ ప్రారంభించాడు
1836లో స్విట్జర్లాండ్ కు చెందిన జె.హెచ్. పేస్టోలోజి కిండర్ గార్టెన్ తరహా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడానికి వోమ్ అండ్ కొలోని యల్ సర్కార్ సోసైటీని స్థాపించాడు.
1837లో ఫ్రెడరిక్ ప్రోబెల్ అనే వ్యక్తి జర్మనీలోని బ్లాంకెన్ బర్ట్‌లో చిన్నపిల్లల స్కూల్‌ను ప్రారంభించాడు. అప్పటివరకూ చిన్నపిల్లల స్కూళ్లు చాలా ఉన్నా దీనిని కిండర్ గార్డెన్ అని నామకరణం చేసింది మాత్రం ఈయనే.
Published date : 13 Nov 2013 10:26AM

Photo Stories