Skip to main content

జంతువుల పేర్లకూ అర్థం ఉంటుందా?

Tenth Classజంతువుల పేర్లు అర్థం లేనివికావు. జంతువుల పేర్లకు కూడా అర్థం వుంటుంది. చాలా జంతువులకు వాటిరూపాన్ని బట్టి, నివసించే ప్రదేశాన్ని బట్టి పేర్లు పెట్టడం జరిగింది.

నీటిగుర్రాన్ని ‘హిప్పోపోటమస్’ (HIPPOPOTAMUS) అంటారు. ఇది గ్రీకుపదం, ఆ భాషలో హిప్పో అంటే నీరు అని, పోటమస్ అంటే నది అని అర్థం. అంటే ఇది నదిగుర్రం అన్నమాట. ఖడ్గమృగాన్ని ‘రైనోసెరస్’ అంటారు. ఇది కూడా గ్రీకుపదమే. రైనో(RHINO)అంటే ముక్కు అని, సిరస్ (CEROS) అంటే కొమ్ము అని గ్రీకులో అర్థం. అంటే ముక్కు మీద కొమ్ము వున్నది కాబట్టి రైనోసిరస్ అని పేరు పెట్టారు.

చిరుతపులిని ‘లియోపార్డ్’ లేదా ‘లెపార్డ్’ (LEO PARD) అంటారు. ఇది లాటిన్ భాషాపదం, లాటిన్‌లో లెపార్డస్ (LEOPARDUS)అంటే చుక్కల లేదా మచ్చలపులి అని అర్థం. ‘జిరాఫి’ (GIRAFFE)అనేది జిరాఫోల్డ్ (ZIRAFOLD)అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. ‘జిరాఫోల్డ్’ అంటే పొడవైన మెడ అని అర్థం.
Published date : 13 Nov 2013 10:24AM

Photo Stories