Skip to main content

జంతువుల కదలికలు ఎలా వుంటాయి?

Tenth Classజంతువుల నడకలు లేదా కదలికలు రకరకాలుగా వుంటాయి. ఇవి తెలుసుకోడానికి చాలా ఆసక్తికరంగా వుంటాయి.
నాలుగు కాళ్ల జంతువులన్నీ కాళ్లు ఎత్తి అడుగులు వేస్తూ నడుస్తాయి. ఇవి ముందరి కుడికాలు, వెనక ఎడమ కాలు ఒకేసారి ఎత్తి అడుగులు వేస్తాయి.
ఏనుగు, జిరాఫీ, ఒంటె మొదలైనవి కొంచెం వయ్యారంగా నడిచినట్లు కనబడతాయి. ఇవి ఒక పక్కనున్న రెండు కాళ్లను ఒకేమారు ఎత్తి వేస్తూ నడుస్తాయి. గుర్రాలు, ఆవులు, గేదెలు మొదలైనవి కాళ్లు ఎత్తివేస్తూ నడుస్తాయి. పులులు, సింహాలు దౌడు తీస్తూ వెళతాయి. కంగారూలు గంతులు వేస్తూ వెళతాయి. కప్పలు దుముకుతూ పోతాయి.
వానపాము, నత్త మొదలయినవి శరీరాన్ని ఒక తరంగం లాగా సంకోచ వ్యాకోచాలకు గురి చేస్తూ కదులుతాయి.
పాములు కండరాలను బిగించి వదులు చేస్తూ వెళతాయి.
బాతులు, తాబేళ్లు మొదలైనవి నీళ్లలో కాళ్లను తెడ్లవలే ఉపయోగించుకుని ఈదుతాయి. చేపలు తోకను పక్కలకు ఆడించడం ద్వారా నీళ్లలో ఈదుతూ వెళతాయి.
ప్రోటోజోవా వంటి ప్రాణులు వెంట్రుకల వంటి అవయవాలను నీళ్లలో అల్లల్లాడించడం ద్వారా ఈదుతాయి.
Published date : 13 Nov 2013 10:18AM

Photo Stories