Skip to main content

హంసలు రంగుల్లో ఉంటాయా?

Tenth Classమనకు మామూలుగా తెల్లగా ఉండే హంసలు మాత్రమే కనబడుతుంటా యి. తెల్లహంసలు ఉత్తర ధ్రువప్రాంతంలో ఎక్కువ ఉంటాయి. నల్లని హంసలు కొన్ని ఆస్ట్రేలియాలో లభిస్తాయి. వీటిలో కొన్ని పూర్తిగా నల్లగా ఉంటే కొన్ని నలుపు, తెలుపు కలిసి ఉంటాయి.

దక్షిణ అమెరికాలో నారింజరంగు హంసలు ఉంటాయి. హంసలలో ఏడు లేక ఎనిమిది జాతులు ఉంటాయి. వీటిలో అయిదు రకాలు తెల్లగా ఉంటాయి. వీటి కాళ్లు మాత్రం నల్లగా ఉంటాయి. పశ్చిమ కెనడా, ఉత్తర అమెరికాలలో నివసించే మామూలు తెల్లని హంసలు 20 సెంటీమీటర్ల వరకూ పొడవు ఉంటాయి. హంసలలో బాగా పొడవైన ట్రాప్టర్ హంసలు 112 సెంటీమీటర్లు పొడవు ఉండేవి. ఈ జాతి దాదాపుగా నశించిపోయింది. యూరప్‌లో చెరువులు, సరస్సులు, ఉద్యానవనాలలో నివసించే మ్యూట్‌శ్వాన్‌లు కోపంగా ప్రవర్తిస్తాయి. హంసలు మామూలుగా 20 సంవత్సరాలు జీవిస్తాయి. జాగ్రత్తగా పెంచితే మాత్రం 50 సంవత్సరాల వరకూ జీవించగలవు.
Published date : 13 Nov 2013 10:59AM

Photo Stories