Skip to main content

ధూళి వల్ల ఎన్నో ఉపయోగాలు

Tenth Classదుమ్ము, ధూళి అనగానే మనకు ఉపయోగం లేనివి, హాని కలిగించేవి అనుకుంటాం. కానీ ధూళి వల్ల మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి.

వాతావర ణంలో ధూళి కణాలు లేకుండా కేవలం స్వచ్ఛమైన గాలి మాత్రమే ఉండి ఉంటే మనకు ఎంతో నష్టం కలిగేది. అయితే ఈ ధూళి ఎంతవరకూ ఉండాలి. గాలిలో ఎక్కువ శాతంలో ఇది ఉంటే మనకు అనారోగ్యాలు, శ్వాస సంబంధమైన ఇబ్బందులు కలుగుతాయి.

ఘనరూపంలో ఉన్న ప్రతి వస్తువు అనేకకోట్ల సూక్ష్మ కణాలతో కూర్చబడి ఉంటుంది. ఈ సూక్ష్మకణాలు విడిపోయినప్పుడు సన్నటి పొడి రూపంలో ఏర్పడతాయి. వీటినే ధూళి లేదా దుమ్ము అంటారు. ఇవి గాలికి ఎగిరి ఒక చోటు నుండి మరొక చోటికి వాతావరణంలోకి వ్యాపిస్తుంటాయి. మేఘాలు వర్షించాలంటే మేఘాలలో ఉండే నీటిఆవిరి గాలిలోని ఈ ధూళి కణాలతో కలవడం వల్ల కొంత ఘనీభవించి నీటి బిందువులు తయారవుతాయి. ఇవే వర్షంగా నేలపై కురుస్తాయి. ధూళి లేకపోతే ఇది సాధ్యం కాదు. పొగమంచు కూడా ధూళి వల్లనే ఏర్పడుతుంది.

వాతావరణంలో గాలితో పాటూ వున్నా ఈ ధూళి కణాల వల్లనే సూర్యకిరణాలు నలువైపులా ప్రసరిస్తాయి. లేకపోతే ఇది సాధ్యం కాదు. సూర్యాస్తమయం తర్వాత కూడా ఒక్కసారిగా చీకటిపడకుండా ఒకటి రెండుగంటలు వెలుతురు ఉండేది కూడా ధూళి వల్లనే.
Published date : 13 Nov 2013 11:01AM

Photo Stories