Skip to main content

చాక్లెట్స్ తినడం మంచిది కాదా?

Tenth Classపిల్లలు మునుపటికంటే చాక్లెట్స్ తినడం ఇప్పుడు ఎక్కువయిందని ఆహార అలవాట్ల అధ్యయనాలు చెపుతున్నాయి. చాక్లెట్స్ తియ్యగా, ఒక విధమైన చిరుచేదుతో కొంచెం మత్తునిచ్చేవిగా వుంటాయి. చాక్లెట్స్‌లో ఎక్కువశాతం చక్కెర, ఘనీభవించబడిన పాలు, కోకో బటర్, కోకో పౌడర్ వుంటా యి. రుచికోసం మరికొన్ని పదార్థాలు కలుపుతారు. వీటిని ఎక్కువకాలం నిల్వ వుంచడంకోసం ప్రిజర్వేటివ్‌లు కలుపుతారు.

చాక్లెట్స్‌లో పంచదార... సుక్రోజ్, లాక్టోజ్‌ల రూపంలో ఉంటుంది. చాక్లెట్స్‌లో వుండే కోకోపౌడర్ చేదుగా వుంటుంది. కోకోగింజలలో ఉండే ‘థియోబ్రోమైన్’ అనే రసాయనం, కాఫీలోని కెఫిన్‌ను పోలి వుంటుంది. ఇది మెదడును ప్రేరేపించి చాక్లెట్స్‌ను మళ్లీమళ్లీ తినాలనిపించేలా చేస్తుంది. వీటివల్ల ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లడం, నిద్రపట్టకపోవడం లాంటి అనారోగ్యలు కలుగుతాయి. చాక్లెట్స్‌లోని చక్కెరలో లభించే Empty Calories (ఖాళీ క్యాలరీలు) శరీరానికి ఎలాంటి శక్తిని ఇవ్వవు. అతిగా చాక్లెట్స్ తింటే శరీరంలో బి విటమిన్ తగ్గిపోతుంది. చాక్లెట్స్‌లోని జిగురువల్ల దంతాలు పుచ్చిపోవచ్చు. ఎప్పుడైనా ఒకటి రెండు సరదాగా తినవచ్చు.
Published date : 13 Nov 2013 10:59AM

Photo Stories