Skip to main content

బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి?

Tenth Classఏదైనా విమానం కూలినపుడు దానిలోని బ్లాక్ బాక్స్ ద్వారా ప్రమాదం ఎలా జరిగిందో తెలుసుకుంటారు. బ్లాక్‌బాక్స్‌లో రెండుముఖ్యమైన పరికరాలు వుంటాయి, ఒకటి డిజిటల్ ప్లేట్ డాటా రికార్డర్, రెండవది కాక్‌పిట్ వాయిస్ రికార్డర్. ఈ రెండు పరికరాలను విడివిడిగా రెండు స్టీలు పెట్టెలలో భద్రపరుస్తారు. దీన్నే బ్లాక్ బాక్స్ అంటారు. ఇది 1000 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణం వరకూ భరించగలదు. ఎంత గట్టిదెబ్బ తగిలినా చెడిపోదు. సముద్రపు నీటిలో రెండు రోజులు చెడిపోకుండా ఉండగలదు. ఫ్లయిట్ డాటా రికార్డర్‌ను విమానం తోక భాగంలోను, కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కాక్‌పిట్‌లోనూ అమరుస్తారు. ఫ్లైట్ డాటా రికార్డర్‌లో తుప్పుపట్టని స్టీల్‌తో తయారైన సాగే గుణంగల టేప్ వుంటుంది. ఇది 6000 అడుగుల పొడవు వుంటుంది. విమానం ప్రయాణిస్తున్నపుడు 25 గంటలపాటు వివరాలను నమోదు చేయగలదు. ఇది విమానంలోని ఉష్ణోగ్రతను, వేగాన్ని కాంతిదిశను, ఇంజను శబ్దాన్ని, వివిధ పరికరాల రీడింగ్‌ను, గాలి వేగాన్ని రికార్డ్ చేస్తుంది.

కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌లో ఉండే మ్యాగ్నటిక్ టేప్ కాక్‌పిట్‌లో పైలట్, కోపైలట్, కాక్‌పిట్‌లోకి ప్రవేశించిన ఇతరులసంభాషణలను, పేలుడు వంటి శబ్దాలను రికార్డు చేస్తుంది.
Published date : 13 Nov 2013 10:20AM

Photo Stories