UPSC Civils Prelims Exam 2024 Question Paper With Key : యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2024 కొశ్చ‌న్ పేప‌ర్ & 'కీ' .. సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్‌లో చూడొచ్చు

సాక్షి ఎడ్యుకేష‌న్ : యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) నిర్వ‌హించే సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమినరీ పరీక్ష–2024 జూన్ 16వ తేదీ ఉద‌యం పేపర్‌–1 (General Studies) ఉదయం 9.30 నుంచి ఉదయం 11.30 గంటల వరకు, పేపర్‌–2 (CSAT) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 4.40 గంటల వరకు జ‌ర‌గ‌నున్న‌ది.

సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌–2024 ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ సహా మొత్తం 21 సర్వీసుల్లో 1,056 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. 

UPSC Civils Prelims Exam 2024కి సంబంధించిన 'కీ' ని..

ఈ నేప‌థ్యంలో.. UPSC Civils Prelims Exam 2024కి సంబంధించిన 'కీ' ని సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌త్యేకంగా ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల‌తో ప్రిపేర్ చేయించ‌నున్నారు. ఈ ప‌రీక్ష ముగిసిన త‌ర్వాత సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ వెబ్‌సైట్ UPSC Civils Prelims Exam 2024 Paper 1 & Paper-2 కొశ్చ‌న్ పేప‌ర్ & కీ అందుబాటులో ఉంటుంది. ఈ 'కీ' కేవ‌లం ఒక అవ‌గాహ‌న కోస‌మే. అంతిమంగా యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ విడుద‌ల చేసే కీ మాత్ర‌మే మీరు ప్రామాణికంగా తీసుకోగ‌ల‌రు.

☛ TSPSC Group 1 Prelims Key 2024 Released : టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 'కీ' విడుద‌ల‌.. మీరు రాసిన‌ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు ఇవే..

ప‌రీక్షావిధానం : 
UPSC సివిల్స్ ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు.. పేపర్‌ 1 జనరల్‌ స్టడీస్‌ (200 మార్కులు), పేపర్‌ 2 సీశ్యాట్‌ (200 మార్కులు) ఉంటాయి. పేపర్‌1లో వచ్చిన మార్కులు మెయిన్‌కు ఎంపికలో అత్యంత కీలకం. పేపర్‌ 2 అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో 33 శాతం మార్కులు సాధిస్తే సరిపోతుంది.

#Tags