IAS Officer : సంచలన నిర్ణయంతో.. 'ఐఏఎస్' ఉద్యోగానికి రాజీనామా.. కార‌ణం ఇదే..

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ నిర్వ‌హించే సివిల్స్ ప‌రీక్ష‌లో విజయం సాధించాలంటే.. ఎంతో క‌ఠిన ప్రిప‌రేష‌న్ ఉంటే కానీ.. ఇందులో విజ‌యం సాధించ‌లేరు.

కానీ లక్షల మందిలో అతికొద్ది మందికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. ఇలాంటి క‌ష్ట‌మైన ప‌రీక్ష‌ల్లో విజ‌యం సాధించి.. ఐఏఎస్ ఉద్యోగం కొట్టాడు ఈయ‌న‌. ఈయ‌నే అభిషేక్‌ సింగ్‌. ఈ నేప‌థ్యంలో అభిషేక్‌ సింగ్ స‌క్సెస్ స్టోరీ మీకోసం..

సంచలన నిర్ణయంతో..
ఉత్తర్‌ప్రదేశ్‌ కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారి అభిషేక్‌ సింగ్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సినిమాలపై మక్కువతో ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులు కూడా ధ్రువీకరించారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం అయిన ఢిల్లీ క్రైమ్‌ సీజన్‌-2లో ఇన్వెస్టిగేషన్‌ ఆఫీసర్‌ పాత్రలో ఆయన మెప్పించిన విషయం తెలిసిందే. గ్లామర్‌లో సినీతారలకు ఏ మాత్రం తగ్గడు. ఓటీటీలలో మంచి నటుడిగా పేరు తెచ్చుకుంటూ, ర్యాంప్‌ల మీద మోడల్‌గా దర్పం ఒలకబోస్తూ, కలెక్టర్‌ స్థాయి అధికారిగా ఢిల్లీ సచివాలయంలో కీలక హోదాలో కొనసాగారు.

☛ IAS Officer Success Story : ఇందుకే క‌లెక్ట‌ర్ ఉద్యోగానికి రాజీనామా చేశా..

ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా..

2011 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిగా భాద్యతలు తీసుకున్నాక సర్వీసులో ఉండగా పలు వివాదాలను ఆయన ఎదుర్కొన్నారు. 2015లో యూపీ నుంచి డిప్యుటేషనుపై దిల్లీకి వెళ్లారు. గతేడాది గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల పరిశీలకుడిగా అభిషేక్‌ వెళ్లిన విషయం తెలిసిందే. ఆ సమయంలో తానే ఎన్నికల పరిశీలకుడినని చెబుతూ ఒక ఫోటో తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్‌ చేశారు. ఇదీ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దం. దీంతో అతన్ని ఎన్నికల విధుల నుంచి ఈసీ తప్పించి సస్పెండ్‌ చేసింది. తాజాగా ఆయన తన ఐఏఎస్‌ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం సంచలనం అయింది. అభిషేక్‌ సతీమణి శక్తి నాగ్‌పాల్‌ కూడా ఐఏఎస్‌ అధికారి కావడం విశేషం. యమునా నగర్‌ ఇసుక అక్రమ రవాణా కుంభకోణం వ్యవహారంలో ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నది.

సొంత గ్రామాలకు వెళ్లలేక..

కొవిడ్‌ మహమ్మారి సమయంలో అభిషేక్‌  పరిపూర్ణ సమాజ సేవకుడిగా మారారు. ఆ సమయంలో రక్తదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఆక్సిజన్‌ కోసం ఇబ్బందులు పడుతున్నవారి అవసరాలు తీర్చారు. వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలోనూ తనవంతు పాత్ర పోషించారు. సొంత గ్రామాలకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న శరణార్థుల ఇబ్బందులు తీర్చారు ఇలా ఎన్నో మంచిపనులు ఆయన చేశారు.

☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ త‌ర్వాత ఉచితంగా

అభిషేక్‌ సింగ్‌ తొలిసారిగా నటించిన ఈ  షాట్‌ ఫిలిం పేరు ‘చార్ పండ్రా’. ఈ సినిమా ప్రముఖ ఎంటర్‌టైన్మెంట్‌ దిగ్గజం టీ సిరీస్‌ రూపొందించింది. ఈ పాటలో అభిషేక్‌ రొమాంటిక్‌ సైడ్‌ని అద్భుత్వంఘౠ ప్రదర్శించాడు. అంతేగాక ప్రేమలో దెబ్బతిన్న ప్రేమికుడిగా హృదయ విదారకరమైన భావాలను వ్యక్తపరిచి నటుడిగా మంచి మార్కులు కొట్టేశాడని చెప్పుకొవచ్చు. అందుకు కారణం ఈ సాంగ్‌ తన నిజ జీవితంలోని సంఘటనలను బేస్‌ చేసుకుని తీసినట్లు ఆయన చెప్పారు.

50 లక్షల మంది ఫాలోవర్లు..

ఐఏఎస్‌ అధికారి అయినప్పటికీ నటుడిగా అద్భుత ప్రదర్శనను కనబరిచిన అభిషేక్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ పాట విడుదలైన నాలుగు రోజులకే యూట్యూబ్‌ ట్రెండింగ్‌ మారింది. ఇప్పటి వరకు ఆ పాటకు 560 మిలియన్ల వ్యూస్‌ వచ్చాయి. అభిషేక్‌కు ఇన్‌స్టాగ్రాంలో 50 లక్షల మంది ఫాలోవర్లు ఉండటం విశేషం.

Supraja,DSP : వీరిని లెక్కపెట్టకుండా చదివా..గ్రూప్-1 ఉద్యోగం కొట్టా..

#Tags