Free Coaching: సివిల్‌ సర్వీస్‌ అప్టిట్యూడ్‌ టెస్టు ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

విద్యారణ్యపురి: హైదరాబాద్‌లోని యూని యన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సివిల్‌ సర్వీస్‌ అప్టిట్యూడ్‌ టెస్టు 2024–2025 విద్యాసంవత్సరంలో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగులైన అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ వర్గాలకు చెందిన వారు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌ ఉమ్మడి వరంగల్‌ జిల్లా శాఖ గౌరవ సంచాలకుడు కె జగన్‌మోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయంలో డిగ్రీ ఉత్తీర్ణులైన వారు హెచ్‌టీటీపీ //టీఎస్‌స్టడీసర్కిల్‌.కో.ఇన్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో జూలై 10వతేదీవరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు జూలై 27న ఎంపిక పరీక్షను నిర్వహిస్తారని తెలిపారు.

ఈ ప్రవేశపరీక్షలో పొందిన మెరిట్‌ ప్రాతిపదికనే అర్హులైన అభ్యర్థులకు ప్రవేశాలు కల్పిస్తారని ఆయన తెలిపారు. ఎస్సీస్టీ స్టడీ సర్కిల్‌ బంజారాహిల్స్‌హై దరాబాద్‌లో సివిల్‌ సర్వీస్‌ ప్రిలిమినరీ పరీక్షకు ఉచిత వసతి భోజనంతోపాటుశిక్షణ ఇస్తారని తెలిపారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆయా అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగిం చేసుకోవాలని ఆయన కోరారు. పూర్తి వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లోనే ఉన్నాయన్నారు.

#Tags