UPSC Recruitment: 2253 ప్ర‌భుత్వ ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం.. వెంటనే ద‌ర‌ఖాస్తు చేసుకోండి

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇటీవ‌ల విడుదల చేసిన 2253 పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కొన‌సాగుతోంది.

ఇందులో కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌(ESIC)లో శాశ్వత ప్రాతిపదికన నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు 1930, ప‌ర్స‌న‌ల్ అసిస్టెంట్ పోస్టులు 323 ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులకు ద‌ర‌ఖాస్తు ఫీజు కేవ‌లం రూ.25, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు. పూర్తి వివరాల కోసం https://upsc.gov.in/ వెబ్‌సైట్ సంప్ర‌దించండి. 

1,930 నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివ‌రాల కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి.. 
 

పర్సనల్ అసిస్టెంట్ (PA) - 323 

విద్యార్హతలు:

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్
  • స్టెనో, టైపింగ్ స్కిల్స్

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు తేదీలు..
దరఖాస్తులు ప్రారంభ తేదీ: మార్చి 7, 2024
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 27, 2024 (సాయంత్రం 6 గంటల వరకు)

వయో పరిమితి:

  • అన్ని విభాగాలకు: 18 సంవత్సరాలు 
  • జనరల్: 30 సంవత్సరాలు
  • ఓబీసీ(OBC): 33 సంవత్సరాలు
  • ఎస్సీ/ఎస్టీ(SC/ST): 35 సంవత్సరాలు
  • దివ్యాంగులు(PwD): 40 సంవత్సరాలు

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష
  • స్కిల్ టెస్ట్
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్
  • మెడికల్ ఎగ్జామినేషన్

జీతం: రూ.44,900 (7వ పే కమిషన్ ప్రకారం)

రాత పరీక్ష తేదీ: జులై 7, 2024

Sub Inspector Jobs: 4,187 సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాలు..

 

#Tags