UPSC CSE 2024 Notification: యూపీఎస్సీ–సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్–2024
మొత్తం పోస్టుల సంఖ్య: 1056
అర్హత: అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు కూడా అర్హులే.
వయసు: 01.08.2024 నాటికి 21 ఏళ్లు నిండి ఉండాలి. అలాగే 32 ఏళ్లు మించకుండా ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అటెంప్ట్‌ల సంఖ్య: జనరల్‌కు ఆరు, ఓబీసీలు, దివ్యాంగులు(జీఎల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ)కు తొమ్మిది సార్లు అవకాశం ఉంది. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అపరిమితం.
ఎంపిక విధానం: రాతపరీక్ష (ప్రిలిమ్స్, మెయిన్స్), ఇంటర్వ్యూ, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పరీక్ష విధానం: ప్రిలిమినరీ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులు ఉంటుంది. సమయం 2 గంటలు. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలుంటాయి. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. రెండో పేపర్ జనరల్ స్టడీస్ క్వాలిఫైయింగ్ పేపర్‌గా ఉంటుంది. దీనిలో 33 శాతం అర్హత సాధించాల్సి ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులను మెయిన్స్ రాయడానికి అనుమతిస్తారు. మెయిన్స్ పరీక్ష మొత్తం 1750 మార్కులకు ఉంటుంది.చివరిగా పర్సనాలిటీ టెస్ట్(ఇంటర్వ్యూ) 275 మార్కులకు ఉంటుంది. మొత్తం 2025 మార్కులకు యూపీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రాథమిక పరీక్ష కేంద్రాలు: అనంతపురం, హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని ప్రధాన పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, విజయవాడ.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 14.02.2024.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 05.03.2024.
దరఖాస్తు సవరణ తేదీలు: 06.03.2024 నుంచి 12.03.2024 వరకు.
ప్రిలిమ్స్ పరీక్ష తేది: 26.05.2024.
వెబ్‌సైట్: https://www.upsc.gov.in/
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- UPSC Recruitment 2024
- UPSC Notification 2024
- UPSC Jobs 2024
- UPSC CSE 2024 Notification
- UPSC 2024 Exam dates
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Recruitment
- Civil Services
- Vacancies
- Jobs
- latest jobs in 2024