TSPSC Notifications 2024 : ఇక‌పై ఈ నిబంధనలకు లోబడే ప్ర‌భుత్వ‌ ఉద్యోగ నోటిఫికేష‌న్లు..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) చైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డిని నియమించిన విష‌యం తెల్సిందే. అలాగే ఈయ‌న టీఎస్పీఎస్సీ చైర్మన్ బాధ్యతలను జ‌న‌వ‌రి 26వ తేదీన (శుక్రవారం) ఉదయం బాధ్యతలు స్వీకరించారు.

అనంతరం రిపబ్లిక్‌ వేడుకల్లో భాగంగా టీఎస్పీఎస్సీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా మహేందర్‌రెడ్డిని సభ్యులుగా మరో నలుగురిని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. 

☛ TSPSC కొత్త‌ చైర్మన్, సభ్యుల బయోడేటాలు ఇవే..

ఈ నిబంధనలకు లోబడే ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ..

ఈ సందర్భంగా నూతన చైర్మన్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. నిబంధనలకు లోబడి ప్రభుత్వ ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసేందుకు కమిషన్ అధికారులు, సభ్యులు అందరూ కలిసి కృషి చేయాలని సూచించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఛైర్మన్ కమిషన్ ఉద్యోగులు, సభ్యులు, అధికారులను ఉద్దేశించి మాట్లాడారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

రాజ్యాంగంలో పొందు పరిచిన ఆర్టికల్ ద్వారా టీఎస్పీఎస్సీ ఏర్పాటైందని, ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసి, బాధ్యతాయుతంగా ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించి, ఉద్యోగాల‌ నోటిఫికేషన్లు జారీ చేసి, రాత పరీక్షలు నిర్వహించి, నిబంధనల ప్రకారం నియామకాలు పూర్తి చేద్దామని పిలుపునిచ్చారు.

#Tags